పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. రాత్రి 1:45 గంటల ప్రాంతంలో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ఉన్న ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. భారత్ చేపట్టిన ఈ సర్జికల్ స్ట్రైక్స్తో దేశమంతా అప్రమత్తమైంది. పాక్ నుంచి ఎటువంటి దాడులు జరిగినా ఎదుర్కునేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావు లేదన్నారు. దేశ సైన్యంతో మనమంతా కలిసి ఉన్నామనే సందేశం ఇవ్వాలని వ్యాఖ్యానించారు…
*భారత సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలి.
*ఈ సమయంలో రాజకీయాలకు తావు లేదు..
*అత్యవసర సర్వీస్ విభాగాల ఉద్యోగులకు సెలవులు రద్దు
*ఉద్యోగులు అంతా అందుబాటులో ఉండాలి
*మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలి..
*విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలి.
*ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు.
*24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్
*పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అనధికారికంగా నివసిస్తున్న పౌరులను తక్షణమే అదుపులోకి తీసుకోవాలి..
*కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలి.
*శాంతి భద్రతల కు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి.
*బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలి.
*అత్యవసర మెడిసిన్ సిద్దం చేసుకోవాలి..
*ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలి
*సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలి.
*ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి.
*ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉంది
*ఫేక్ న్యూస్ అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
*రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాల ను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలి…
*జిల్లా కేంద్రాలు, సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండి భధ్రతను పెంచాలి.. అన్ని అన్నారు..
*హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను కట్టుదిట్టం చేయాలి
*ఐటీ సంస్థల దగ్గర భధ్రతను పెంచాలి.
హైదరాబాద్ నగరం లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలి…
అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలి…
హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలి…