మంత్రి తుమ్మలపై తిరగబడ్డ కాంగ్రెస్ నాయకులు
ఖమ్మంలో కాంగ్రెస్ మీటింగ్లో గొడవ…
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుకు సొంత పార్టీ లీడర్లు షాక్ ఇచ్చారు. బుధవారం మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ నాయకులు తిరగబడ్డారు. ఖమ్మంలో నిర్వహించిన కాంగ్రెస్ మీటింగ్లో పెద్ద గొడవ జరిగింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనారిటీలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ మైనారిటీ నాయకులు అసహనం వ్యక్తం చేశారు…
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాత కాంగ్రెస్ నాయకులను గౌరవించడం లేదని, మైనారిటీలను పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్ మైనారిటీ నాయకులు…
తుమ్మల మాట్లాడి వెళ్ళిపోతాడు.. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు
మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక..
తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడి వెళ్ళిపోతాడని.. ఆయన తీరుతో పార్టీకి నష్టం వాటిల్లుతుందని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి తుమ్మలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా సదరు మైనార్టీ లీడర్లు హెచ్చరించడం గమనార్హం. ప్రస్తుతం ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది…