దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. కరెంట్ బంద్

దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్.. కరెంట్ బంద్

భారత్, పాకిస్తాన్ యుద్ధ వాతావరణ కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో ఎలా స్పందించాలో దేశవ్యాప్తంగా నిర్వహించే మాక్ డ్రిల్‌లో భాగంగా న్యూఢిల్లీలో ఈరోజు రాత్రి 8:00 గంటల నుంచి15 నిమిషాల పాటు బ్లాక్‌అవుట్ ప్రకటించారు. హోం మినిస్ట్రీ సమక్షంలో ఈ ఎక్స్‌ర్‌సైజ్ నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా కరెంట్ కట్, ఇతర అత్యవసర సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలని మాక్ డ్రిల్ నిర్వహించారు…

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల వేళ దేశవ్యాప్తంగా బుధవారం సివిల్‌ మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ అభ్యాస్‌ పేరుతో పలు రాష్ర్టాల్లోని కీలక ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ చేపట్టారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించాల్సిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు 200కు పైగా జిల్లాల్లో సివిల్ మాక్‌డ్రిల్ చేపట్టారు. సాయంత్రం నాలుగు గంటలకు మాక్‌ డ్రిల్ ప్రారంభం కాగానే పలు ప్రాంతాల్లో 2 నిమిషాలపాటు సైరన్‌లు మోగాయి. ఈ మాక్‌ డ్రిల్స్‌లో ఆయా జిల్లా అధికార యంత్రాంగాలు, సివిల్‌ డిఫెన్స్‌ వార్డెన్లు, వాలంటీర్లు పాల్గొన్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశ వ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ చేపట్టారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో అవి జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌, రాజస్థాన్‌ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితం అయ్యాయి. ఈ సారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించారు..