భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ..

గురువారం రాత్రి భారత్ మీద 400 డ్రోన్లతో దాడికి యత్నించిన పాకిస్తాన్.. సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత్ ఆర్మీ

నిన్న రాత్రి గురువారం దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్ (లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్ చేస్తూ వీటిని లాంచ్ చేశారని ఆర్మీ వర్గాలు తెలిపాయి…

వాటన్నింటినీ నాశనం చేసినట్లు.. ఈ డ్రోన్లకు కెమెరాలను ఫిక్స్ చేశారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ ఇలా పన్నాగం పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి…

భార‌త్‌లోని 36 ప్రాంతాల్లో పాకిస్తాన్ 300 – 400 వ‌ర‌కు డ్రోన్లు ప్ర‌యోగించింద‌ని విదేశాంగ శాఖ కార్య‌ద‌ర్శి, ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధులు తెలిపారు. భార‌త గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రీక్షించడం, నిఘా స‌మాచార సేక‌ర‌ణే ల‌క్ష్యంగా దాడులు జ‌రిగాయని పేర్కొన్నారు…భార‌త గ‌గ‌న‌త‌ల ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రీక్షించడం, నిఘా స‌మాచార సేక‌ర‌ణే ల‌క్ష్యంగా దాడులు జ‌రిగాయని పేర్కొన్నారు. ఆప‌రేష‌న్ సిందూర్‌కు సంబంధించి విదేశాంగ కార్య‌ద‌ర్శి విక్ర‌మ్ మిస్రీ.. ర‌క్ష‌ణ శాఖ ప్ర‌తినిధులు క‌ర్న‌ల్ సోఫియా ఖురేషి, వింగ్ క‌మాండ‌ర్ వ్యోమికా సింగ్‌తో క‌లిసి ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు.ప్రాథ‌మిక నివేదిక‌ల ప్ర‌కారం తుర్కియేకు చెందిన ఆసిస్‌గార్డ్ సోంగ‌ర్ అనే డ్రోన్ల‌ను ప్ర‌యోగించిన‌ట్లు తెలిసింది. పాక్ నుంచి వ‌చ్చిన డ్రోన్ల‌ను చాలా వ‌ర‌కు ధ్వంసం చేశాం. భ‌టిండా సైనిక కేంద్రంపై దాడికి ప్ర‌య‌త్నించారు. ప్ర‌యాణికుల విమానాశ్ర‌యాన్ని పాక్ సైనికులు ర‌క్ష‌ణ‌గా వాడుకున్నారు. మ‌న సైనికుల మౌలిక వ‌స‌తులు దెబ్బ‌తీసేందుకు య‌త్నించారు. స‌రిహ‌ద్దు వెంబ‌డి భారీస్థాయిలో కాల్పుల‌కు దిగారు. పాక్ దాడుల‌ను మ‌న రక్ష‌ణ వ్య‌వ‌స్థ స‌మ‌ర్థ‌వంతంగా తిప్పికొట్టింది. పాక్ వినియోగించే డ్రోన్ల ప్ర‌యోగ కేంద్రాన్ని ధ్వంసం చేశాం. భార‌త బ‌ల‌గాల ప్ర‌తి దాడుల్లో పాక్ భారీగా న‌ష్ట‌పోయింది. పాక్ త‌న పౌర విమానాశ్ర‌యాల‌ను ఇంకా మూసివేయ‌లేదు. త‌మ దాడుల‌కు భార‌త్ నుంచి ప్ర‌తిస్పంద‌న ఉంటుంద‌ని తెలిసీ పౌర విమానాల‌ను ర‌క్ష‌ణ క‌వ‌చంగా పాకిస్తాన్ వాడుకుంటోంది. ఇది భార‌త్ – పాక్ మ‌ధ్య అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు స‌మీపంలో వెళ్లే విమానాల‌తో పాటు అక్క‌డి పౌర విమానాల‌కు సుర‌క్షితం కాదు. అంతర్జాతీయ విమానాల‌ను దృష్టిలో ఉంచుకుని భార‌త వాయుసేన పూర్తి సంయ‌మ‌నంగా వ్య‌వ‌హరించాలి అని పేర్కొన్నారు.