పాకిస్థాన్ చేసిన డ్రోన్ల దాడులకు ప్రతీకారంగా ఆ దేశ ఎయిర్బోస్లను ధ్వంసం చేసినట్లు లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ప్రకటించారు. మే 7 – 10వ తేదీల మధ్య ఎదురుకాల్పుల్లో 35-40 మంది పాక్ సైనికులు హతమయ్యారని ఆ దేశ ఆర్మీ వెల్లడించిందన్నారు. జమ్మూ, ఉదంపూర్, పఠాన్కోట్పై దాడికి పాక్ చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టినట్లు వివరించారు. అటు పాక్ కాల్పుల్లో ఐదుగురు భారత జవాన్లు దేశం కోసం అమరులయ్యారని తెలిపారు….
పాక్ యుద్ధ విమానాలు నేలకూల్చాం: త్రివిధ దళాల అధిపతులు
భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చినట్లు త్రివిధ దళాల అధిపతులు మీడియా సమావేశంలో ప్రకటించారు. ఎన్ని విమానాలు కూల్చామన్నది బయటకు చెప్పలేమని, తమ వద్ద స్పష్టమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. కాల్పులు జరుపుతూ చొరబడటంలో పాక్ సైన్యం ఆరితేరిందని, వీటిని నిత్యం తాము అడ్డుకుంటూనే ఉంటామని స్పష్టం చేశారు…