టర్కీకి భారతీయ పర్యాటకుల షాక్…దయచేసి టర్కీ రండి…
టర్కీ నుంచి దిగుమతులను నిలిపివేయాలని వ్యాపారులందరూ ఏకగ్రీవంగా తీర్మానం..
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా, ఉగ్రవాదులపై భారత్ చేసిన ”ఆపరేషన్ సిందూర్”ని తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా, పెద్ద ఎత్తున పాకిస్తాన్‌కి డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్‌పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్‌లో టర్కీని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్‌ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్‌ని పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కీష్ యాపిల్స్ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి..మరోవైపు, టర్కీ పర్యాటక శాఖ, భారతీయులు తమను బాయ్‌కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్‌లను క్యాన్సల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భారతీయలు ఆ దేశానికి వెళ్తుంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది….
దయచేసి టర్కీ రండి.
టర్కీ పర్యాటక శాఖ భారతీయ పర్యాటకులకు రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇండియా, పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో టర్కీ పాక్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించడమే కాదు ఆయుధ సాయం చేసినట్లు ఆరోపణలున్నాయి…ఈ క్రమంలోనే భారతీయులు బాయ్ కాట్ టర్కీ పేరిట ఆ దేశ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. దీంతో తమ పర్యాటక రంగం దెబ్బతిని ఆదాయం పడిపోవడంతో టర్కీ దిగివచ్చింది… తమ దేశ పర్యటనను రద్దు చేసుకోవద్దని, భారతీయ పర్యాటకులకు ఎలాంటి ప్రమాదం లేదని అందులో వేడుకున్నారు..
టర్కీ నుంచి దిగుమతులను నిలిపివేయాలని వ్యాపారులందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.
ఉదయ్‌పూర్ మార్బుల్ ప్రాసెసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సురానా మాట్లాడుతూ, టర్కీ నుంచి, ముఖ్యంగా మార్బుల్ దిగుమతులను నిలిపివేయాలని ప్రధానికి లేఖ రాశామని తెలిపారు.
“ఆపరేషన్ సింధూర్ను ఉద్దేశిస్తూ, గత కొద్ది రోజుల్లో ఆయన తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాలకు మేము పూర్తి మద్దతు ఇస్తున్నాము” అని పటేల్ అన్నారు.
“ఏ దేశంపై అయినా ఆంక్షలు విధిస్తే, మేము ప్రధాని వెంటే ఉంటామని హామీ ఇచ్చాము. వ్యాపారం, పరిశ్రమ కంటే దేశం, దేశ ప్రయోజనాలే ముఖ్యం” అని పటేల్ అన్నారు.
“భారతదేశంలోని ఇతర సంఘాలు కూడా టర్కీ నుంచి దిగుమతులను నిలిపివేయాలని నిర్ణయిస్తే, ఈ క్లిష్ట సమయంలో భారతీయ వ్యాపారాలు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాయనే స్పష్టమైన సందేశం ప్రపంచానికి వెళుతుంది” అని ఆయన అన్నారు.
మార్బుల్ మాత్రమే కాకుండా.. టర్కీ నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే ఇతర ఉత్పత్తులపై కూడా నిషేధం విధించాలని ఆయన సూచించారు.
ఉదయ్‌పూర్‌కు చెందిన వ్యాపారుల సంఘం ప్రకారం, భారతదేశం ఏటా 14-18 లక్షల టన్నుల మార్బుల్‌ను దిగుమతి చేసుకుంటుంది, అందులో దాదాపు 70 శాతం టర్కీ నుంచి వస్తుంది.
ఉదయ్‌పూర్ మార్బుల్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి హితేష్ పటేల్ మాట్లాడుతూ, టర్కీ నుంచి దిగుమతుల విలువ రూ. 2500-3000 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఈ సంఘంలో దాదాపు 125 మంది సభ్యులు ఉన్నారని ఆయన చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సాయుధ దళాలు ఇచ్చిన ప్రెస్ బ్రీఫింగ్లో, ప్రయోగించిన డ్రోన్ల శిథిలాలను ఫోరెన్సిక్ పరీక్షించినట్లు, అవి టర్కిష్ అసిస్‌గార్డ్ సోంగర్ డ్రోన్లని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నట్లు పేర్కొన్నారు