ఆపరేషన్ సిందూర్ దాటికి పాకిస్తాన్ నిలవలేకపోయింది. ఇన్నాళ్లు మేము గొప్ప మిలిటరీ శక్తిగా భావిస్తూ వచ్చిన పాకిస్తాన్‌కి, భారత్ దాడులు దాని స్థాయి ఎంటో నిరూపించింది..
https://x.com/reenu26451/status/1922169041378005142?t=paeeA8CwgTbPk9k9VElP1Q&s=19
పాకిస్తాన్ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలపై భారత్ దాడులు చేసింది. పాకిస్తాన్ లోని ఎయిర్‌బేస్‌లను భారత్ లక్ష్యంగా చేసుకుని భీకర దాడి చేసింది. అయితే, ఇప్పుడు ఓ సమాచారం పాకిస్తాన్లో వణుకు పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ అణు స్థావరాలపై భారత్ బ్రహ్మోస్‌తో దాడులు చేసినట్లు తెలుస్తోంది. బ్రహ్మోస్ ధాటికి పాక్ అణ్వాయుధాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లు సమాచారం. దీని కారణంగా, పాకిస్తాన్ అమెరికా కాళ్లు పట్టుకుని భారత్‌ని కాల్పుల విరమణకు ఒప్పించాలని ప్రాధేయపడినట్లు తెలుస్తోంది…
ఇండియా ‘ఆపరేషన్ సిందూర్’ మొదలుపెట్టాక ఇలా జరిగింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ దేశంలో వరసగా వచ్చిన భూ ప్రకంపనలకు మరో కారణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతుంది..రీనా యాదవ్ అనే ఓ ఎక్స్ హ్యాండ్లర్.. ఇలా రాసుకొచ్చారు. పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అయ్యింది.. స్థానికులు వాంతులు, తలనొప్పి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో బాధితులకు రహస్యంగా చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ సైన్యం దాస్తుంది అంటూ రాసుకొచ్చారామె.
మరో ఎక్స్ హ్యాండర్ అభి అయితే.. ఇలా చెబుతున్నాడు. పాకిస్తాన్ దేశంలో అణు స్థావరాల నుంచి రేడియేషన్ లీక్ అవుతుంది.. కైరానా హిల్స్ ప్రాంతంలోని పాకిస్తాన్ న్యూక్లియర్ బేస్.. ఇండియా దాడిలో దెబ్బతిన్నది అంటూ రాసుకొచ్చాడు. దీనికి సాక్ష్యం ఇదిగో అంటూ గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ పేరుతో రిలీజ్ అయిన నోట్ ను షేర్ చేశాడు…..ఈజిప్ట్‌కు చెందిన ఎయిర్ ఫోర్స్ విమానం మంగళవారం ఉదయం పాకిస్తాన్‌కు చేరుకుంది. బోరాన్-10 అనే ఐసోటోప్‌ను ఆ విమానంలో పాకిస్తాన్ కు చేర్చినట్లు తెలిసింది. బోరాన్ అనే ఈ రసాయన పదార్థాన్ని అణు స్థావరాల్లో కెమికల్ రియాక్షన్స్‌ను నియంత్రించడానికి, పేలుళ్లను నిరోధించడానికి ఉపయోగిస్తుంటారు.
అలాంటి.. రసాయన పదార్థం ఇప్పుడు పాకిస్తాన్‌కు అవసరం పడిందంటే నిజంగానే రేడియేషన్ లీక్ అయి ఉండొచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి. పాకిస్తాన్ మిలటరీ రేడియేషన్ లీక్ అయిన విషయాన్ని కప్పి పుచ్చుతుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. పాకిస్తాన్‌లోని కైరానా హిల్స్ సమీపంలో ఉన్న అణు స్థావరంపై భారత వైమానిక దళం దాడి చేసినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.