వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజ న్న ఆలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన పట్టణ బంద్ ప్రశాంతంగా జరిగింది.. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ తమ దుకాణాలను మూసి వేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామక్రిష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీసహా అన్ని పార్టీల నాయకులతో కలిసి రాజన్న ఆలయ రక్షక కమిటీని ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనుల భాగంగా రాబోయే రెండు సంవత్సరాలపాటు ఆలయాన్ని మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రాజన్న ఆలయ రక్షక కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
కమిటీ ఛైర్మన్ ప్రతాప రామక్రిష్ణ మాట్లాడుతూ అభివృద్ధి పనుల పేరుతో 2 ఏళ్లపాటు రాజన్న ఆలయాన్ని మూసివేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. వేములవాడ రాజన్న అభివృద్ధి పేరుతో పరివార్ దేవతామూర్తుల (హిందూ) విగ్రహాలను తొలగించడాన్ని వ్యతిరేకించారు. రాజన్న ఆలయం వద్దనున్న దర్గాను తొలగించాలను రాజన్న భక్తులంతా ముక్త కంఠంతో కోరుతున్నా పట్టించుకోని అధికారులు ఆలయాన్ని మూసివేయాలనుకోవడం విడ్డూరమన్నారు. వ్యాపారులంతా స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి వేయడంతో పట్టణం బోసిపోయింది