పాదాలు కడుక్కోవడం అనే సంప్రదాయం పెద్దలు మరియు గురువులకే పరిమితం, కానీ అందాల పోటీదారులకు కూడా అదే మర్యాద ఇవ్వడం అనవసరమని నెటిజన్లు అంటున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసింది.తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత దేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇది అన్నారు. వీర వీరవనితలు రాణి రుద్రమదేవి,సమ్మక్క – సారలమ్మలు పుట్టిన నేలపైనే ఈ ఘోర అవమానం జరగడం చాలా బాధాకరం వెల్లడించారు.తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన,అవమానకరమైన,అత్యంత హీనమైన చర్య..యావత్ మహిళ లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సబితా. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని,తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతామని గొప్పగా చెప్పే ప్రభుత్వం విదేశీయుల కాళ్ళు కడిగించటం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారన్నారు.
ఒకవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తుంటే, మరోవైపు విదేశీ అందగత్తెలకు తమ కాళ్లు కడిగి, టవల్తో తుడిపించడం దేనికి సంకేతం ఇస్తుందన్నారు. గతంలో కేసీఆర్ గ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరిస్తే,నేడు బిందెలా కష్టాలు తెచ్చి పాత రోజులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని వెల్లడించారు సబితా. కానీ ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. అదేవిధంగా మహిళల ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పతనం అవ్వటం ఖాయం అంటు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు..