*BIG BREAKING:
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం..*
*ఆరు నెలల చిన్నారితో సహా ఆరుగురు..?*
మహారాష్ట్ర శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు.
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. సోలాపూర్లోని శిర్పూర్ జైన్ బస్ స్టాండ్ ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న చాలా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ మంటల్లో ఆరు నెలల చిన్నారితో పాటు మరో ఆరుగురు చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వీరిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన విషయం తెలియదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.