త్వరలో కొత్త రూ.20 నోట్లు..ఆర్బీఐ(RBI) మరోసారి కీలక ప్రకటన..!

**

మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద త్వరలో కొత్త రూ.20 డినామినేషన్ నోట్లను విడుదల చేయనున్నట్లు RBI ప్రకటించింది. ఈ నోట్లపై ప్రస్తుత RBI గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. కొత్త నోట్ల డిజైన్, ఫీచర్లు ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్ల మాదిరిగానే ఉంటాయని తెలిపింది. కాగా, గతంలో జారీ చేసిన అన్ని రూ.20 నోట్లు గవర్నర్ సంతకంతో సంబంధం లేకుండా చెల్లుబాటు అవుతాయని ఆర్బీఐ తెలిపింది

ఆర్బీఐ(RBI) మరోసారి కీలక ప్రకటన చేసింది. త్వరలో కొత్త రూ.20 నోట్లు రానున్నాయి. అయితే గతంలో (2016) పెద్ద నోట్ల రద్దు, రూ.2000 కరెన్సీ నోట్లు తీసుకురావడం, మళ్లీ వాటిని ఉపసంహరించుకోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు కొత్త నోట్లపై ప్రకటన వచ్చిన ప్రజల్లో కాస్త ఆందోళన కలుగుతుంది. పాత నోట్లను రద్దు చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న అన్ని రూ.20 బ్యాంక్ నోట్లకు చట్టబద్ధత ఉంటుందని చెప్పింది. పాత నోట్లు రద్దు కావని, యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.