ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ…సిటీ బంద్ కు పిలుపనిచ్చిన బీజేపీ….!

ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ

ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ మీడియా ప్రతినిధులు

ఇల్లందు క్రాస్ రోడ్డులో బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని పరస్పరం దాడులు…

యువకులను పోలీస్ స్టేషన్లో ఉంచిన పోలీసులు..భారీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చిన నాయకులు..

కొంత మందిని దూషించారని, నీ ఆధార్ కార్డ్ ఎక్కడ అని నిందించారని ఆరోపణలు చేస్తున్నారు మరో వర్గం..

తిరంగా ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతల తెలుపుతున్నారు..

పోలీస్ స్టేషన్లో ఉన్న ఇరువర్గాలను సముదాయిస్తున్న పోలీసులు..

నగరంలో ఇవ్వాళ జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం సిటీ బంద్ కు పిలుపనిచ్చిన బీజేపీ….

ఇల్లందు క్రాస్ రోడ్డులో బీజేపీ నాయకుల తిరంగా ర్యాలీని అడ్డుకున్నారని.. ఓ వర్గంపై మరో వర్గం దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. ఈ తరుణంలోనే యువకులను ఖమ్మం 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంచారు.

దింతో భారీగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ తరలివచ్చారు బీజేపీ పార్టీ నాయకులు. ఆ యువకులను విదేశీ కుక్కలుగా దూషించారని, నీ ఆధార్ కార్డ్ ఎక్కడ అని నిందించారని ఆరోపణలు వస్తున్నాయి. తిరంగా ర్యాలీని అడ్డుకోవడం కోసం ప్రయత్నించారని బీజేపీ నేతలు అటు ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇరువర్గాలను సముదాయిస్తున్నారు పోలీసులు. నగరంలో ఇవ్వాళ జరిగిన దాడికి నిరసనగా ఖమ్మం సిటీ బంద్ కు పిలుపనించింది బీజేపీ పార్టీ. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ..