తాము ర్యాలీ చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారు…సీఎం రేవంత్ రెడ్డి…
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాటాలకు తలొగ్గి కేంద్ర ప్రభుత్వం సువర్ణాకాశం చేజార్చుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పడంలో మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఇందిరా గాంధీ ప్రధాని ఉన్నప్పుడు పాకిస్థాన్ తో యుద్ధం చేశారని, అమెరికాతో పాటు అగ్ర దేశాలు భారత్‌పై ఒత్తిడి తీసుకొచ్చాయని, ఎక్కడా కూడా ఇందిరా గాంధీ తలొగ్గలేదని గుర్తు చేశారు. యుద్ధం చేసి పాక్‌పై గెలిచిన ధీరశాలిగా దివంగత ప్రధాని ఇందిరా గాంధీ అని ప్రశంసించారు…
ఇందిరాగాంధీలా ధైర్యం మోదీకి లేకపోయింది”
రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల్లో మరింత తీవ్రతను కనబరుస్తూ, పాకిస్థాన్ విషయంలో కేంద్రం ప్రదర్శిస్తున్న మౌనానికే ఈ ప్రమాదకర ధోరణికి కారణమని పేర్కొన్నారు. ‘గతంలో ఇందిరాగాంధీ అమెరికా సహా అంతర్జాతీయ ఒత్తిళ్లను లెక్కచేయకుండా పాకిస్థాన్‌తో యుద్ధాన్ని సాగించి భారతదేశ విజయాన్ని నిర్ధారించారు. కానీ ఇప్పటి ప్రధాని అమెరికా అధ్యక్షుల మాటలు వింటూ, దేశ భద్రతా విధానాన్ని బలహీనపరిచారు,’ అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (US President Trump) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం ముద్ర వేసిన మార్గం సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు…
పహల్గాం టెర్రర్ అటాక్ తరువాత దేశంలో తొలిసారి తిరంగా ర్యాలీ చేసింది తామేనని రేవంత్ తెలిపారు. తాము ర్యాలీ చేసినప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారా? అని చురకలంటించారు. రాజకీయాలను పక్కన పెట్టి ఆపరేషన్ సిందూర్ విషయంలో మోడీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరపున తాము సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు…