శరీరానికి చక్కని వ్యాయామము యోగా…

ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి.మన ఆహార నియమాలు,దినచర్య రుతుచర్య, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. మరియు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మనము ముందుగా తినే ఆహారం మీద అవగాహన తెచ్చుకోవాలి. శరీరానికి సరిపడినంత ఆహారం మాత్రమే తీసుకోవాలి. అధిక నీరు తాగటం, మితిమీరిన ఆహారం తినటం,మరియు ఆరోగ్యవంతులు అనవసరమైనటువంటి డైట్ చేయడం,పనికిమాలిన చిట్కాలు పాటించడం, సరియైన నిద్ర లేకపోవడం, రోడ్డు మీద దొరికే తినుబండారాలు తినటం, సంపాదన పిచ్చిలో పడిపోయి ఆరోగ్యాన్ని మర్చిపోవడం, సరైన ఆరోగ్య నిర్వహణ లేకపోవడం, అధికంగా మాంసాహారం తినడం, కూల్ డ్రింక్స్,పిజ్జా,బర్గర్,మైదాపిండి, సెనగపిండి తో తయారు చేసినటువంటి తినుబండారాలు తినడం ఆల్కహాల్ తాగటం,మత్తు పానీయాలు తీసుకోవటం, గోవా గుట్కాలు తినడం,నోరు సరిగ్గా పరిశుభ్రం చేసుకోకఫోవడం, శరీరానికి సరైన విశ్రాంతి ఇవ్వకపోవడం. ఉదయం నుంచి రాత్రి 12 గంటల వరకు సెల్ ఫోన్ ఎక్కువగా చూడటం, ఆన్లైన్ లో ఫుడ్ తెచ్చుకొని తినటం, పెరిగే పిల్లలకు శరీర ఆహారం ఇవ్వకపోవడం,పోషక పదార్థాలు అందకపోవటము, విటమిన్లు లోపాలు రావటం, శరీరం నుండి విషపూరిత చెమట రావటానికి,సరైన క్రీడలు లేకపోవటము, తెల్లవారుజామున నిద్ర లేవకపోవడం, మలమూత్ర విసర్జన చక్కగా చేసుకోకపోవడం, శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం, జీవితం హడావుడిగా సాగిపోవటం జరుగుతుంది.చివరగా రోగం వచ్చిన తర్వాత సంపాదించిన సంపాదన మొత్తం ఆ రోగానికి పెట్టడం జరుగుతుంది. కనుక దయచేసి అందరూ రోగం రాకముందే మేలుకొని రోగం రాకుండా ఉండటానికి,తగిన జాగ్రత్తలు సూచనలు వైద్యుల సలహాలను తీసుకొని ఆహార నియమాలు దినచర్య,ఋతు చర్య పాటిస్తూ శరీరానికి చక్కని వ్యాయామము యోగా ప్రాణాయామము ధ్యానము మరియు స్కిప్పింగ్,డాన్సింగ్, ఏరోబిక్,మార్షల్ ఆర్ట్స్, స్విమ్మింగ్,ఇలాంటివి చాలా రకాల వ్యాయామాలల్లో ఏదో ఒక వ్యాయామము మన జీవితంలో ఒక భాగం చేసుకొని ఆరోగ్యానికి కాపాడుకోవటం.మంచి ఆహారపు అలవాట్లు పాటించటం, చెయండి.
ఈ హడావుడి జీవితంలో పిల్లలు,తల్లిదండ్రులు, ముసలివారు,యువతి యువకులు, బాలురు బాలికలు,వృద్ధులు,మహిళా మహారాణులు మీరందరూ కలిసి చక్కని ఏదోక వ్యాయామం చేసి చక్కని శరీరాన్ని,చక్కని సౌందర్యాన్ని, చక్కని మనసుని,చక్కని తేజస్సుని,చక్కని ఓజస్సుని, చక్కని మేధాశక్తిని,చక్కని సంపూర్ణ జీర్ణ క్రియ శక్తిని తెచ్చుకొని ఆరోగ్యవంతులు ఉండడానికి నేను ఈ వేసవికాలంలో 20-05-2025 నుండీ 30-05-2025 వరకూ పది రోజుల యోగ, ప్రాణాయామ,ధ్యాన, ఆయుర్వేద శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నాను. ఈ శిక్షణ యోగ తరగతులు ఉదయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆరోగ్యవంతులు కాగలరు.ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోగలరు 7396126557.
ఉచిత యోగ ఆయుర్వేద శిక్షణా తరగతులు జరుగు ప్రదేశము.అడ్వకేట్ విజయ శాంత మేడం గారి ఇంటి వద్ద, ప్రశాంతి నగర్ రోడ్ నెంబర్ 17, ఖానాపురం హవేలీ,
ఖమ్మం. .నిర్వహించువారు యోగా చార్యులు,ఆయుర్వేద వైద్య నిపుణులు షేక్ బాహర్ అలీ..