మరోసారి పాకిస్తాన్ సైన్యంపై దాడి జరిగింది. బలూచిస్తాన్లో సైనిక కాన్వాయ్పై జరిగిన దాడిలో 32 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. కరాచీ-క్వెట్టా హైవేలోని ఖుజ్దార్లోని జోరో పాయింట్ సమీపంలో జరిగిన బాంబు పేలుడులో పాక్ సైనికులు చనిపోవడంతో పాటు వందల మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది…హైవేపై ఆపి ఉంచిన కారులో..
least 32 Pakistani military personnel were killed.
ఆపి ఉంచిన కారులో అమర్చిన పేలుడు పదార్థం పేలిపోవడంతో ఎనిమిది వాహనాలు, బస్సుపై వీటి ప్రభావం పడింది. ఈ కాన్వాయ్లోని మూడు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటిలో ఒకటి సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులను తీసుకెళ్తున్న బస్సు. వీరిలో భారీగా గాయపడటంతో వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది…
https://x.com/TheBolanN/status/1926476416410853860?t=g2_8cgO5OHnUTmghYN5qEQ&s=19