పవన్ కళ్యాణ్ సినిమాకే అడ్డంపోతారా..!.

పవన్ కళ్యాణ్ సినిమాకే అడ్డంపోతారా..!.

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘హరి హర వీర మల్లు’ విడుదలకు సిద్ధమైంది. జూన్‌లో సినిమా విడుదల కానుండగా, జూన్ 1 నుంచి థియేటర్ల బంద్.. అంటూ, రచ్చ జరుగుతోంది…

పవన్ సినిమా రిలీజ్ సమయంలో థియేటర్లు మూసేస్తామనడం దుస్సాహసం: అల్లు అరవింద్

మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి డిప్యూటీ సీఎం అయిన వ్యక్తి పవన్ కళ్యాణ్

ఒకసారి అశ్వినీదత్ తో కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లాను

ఛాంబర్ తరపున సీఎం చంద్రబాబును కలవాలని పవన్ హింట్ ఇచ్చారు

పవన్ హింట్ ఇచ్చినా కూడా ఎవరూ ముఖ్యమంత్రిని కలవలేదు.. అన్నీ అల్లు అరవింద్ అన్నారు.

ఇది ఇలా ఉండగా..పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓ ప్రభుత్వంలో భాగస్వామి. కీలక పదవిలో ఉన్నారు పవన్ కళ్యాణ్. సో, అరచేతిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ సినిమాని ఆపాలనుకుంటే.. ‘పోతారు.. మొత్తం పోతారు’.!

చివరగా.. ‘మనల్ని ఎవడ్రా ఆపేది.?’.. ఇదీ పవన్ కళ్యాణ్ అభిమానుల డైలాగ్.!.

ఈ థియేటర్ల మూసివేత వెనుక ఆ నలుగురు ఉన్నారని ప్రచారం జరిగింది. ఆ నలుగురిలో అల్లు అరవింద్ పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించిన అరవింద్.. ఆ నలుగురిలో తాను లేనని చెప్పారు.

“ఆ నలుగురు వ్యాపారంలో నేను లేను. కోవిడ్ టైంలోనే బయటకు వచ్చేశాను. తెలంగాణలో ప్రస్తుతం నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజ్ లో లేదు. నా దగ్గర ఉన్నది ఒక్కటే థియేటర్..

AAA. దానికి ఓనర్ ని. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నాను. తెలుగు రాష్ట్రాల్లో 1500 థియేటర్లు ఉంటే..

నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అవి కూడా లీజ్ అయిపోయిన తర్వాత.. రెన్యువల్ చేయించవద్దని మా స్టాఫ్ తో చెప్పాను. పాత అలవాటు కొద్దీ ‘ఆ నలుగురు ఆ నలుగురు’ అంటూ నా ఫొటో వేస్తున్నారు తప్ప..

నేను ఆ నలుగురిలో లేను.” అని అల్లు అరవింద్ అన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న దానిపై కూడా అల్లు అరవింద్ స్పందించారు. “పవన్ కళ్యాణ్ గారు బాధ పడింది వంద శాతం నిజం. ఆయన సినిమా వస్తుంటే..

థియేటర్లు మూసేస్తాం అంటూ.. ఆయనను బెదిరిస్తున్నారా ఏంటి?” అని అరవింద్ ప్రశ్నించారు. “పవన్ కళ్యాణ్ సినిమా విడుదలవుతుండగా థియేటర్లు మూసేస్తాం అనడం దుస్సాహసం. పెద్దలు కానీ, చిన్నలు కానీ ఈ దుస్సాహసానికి ముందడుగు వేయకూడదు. మన ఇండస్ట్రీ నుంచి వెళ్లి, మన ఇండస్ట్రీకి హెల్ప్ చేస్తున్న వ్యక్తి పవన్.” అని అరవింద్ అన్నారు..