🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☘️పంచాంగం☘️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 26 – 05 – 2025,
వారం … ఇందువాసరే ( సోమవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
వసంత ఋతువు,
వైశాఖ మాసం,
బహుళ పక్షం,
తిథి : *చతుర్దశి* ఉ11.19 వరకు,
నక్షత్రం : *భరణి* ఉ7.38 వరకు,
యోగం : *శోభన* ఉ6.31 వరకు,
తదుపరి *అతిగండ* తె3.32 వరకు,
కరణం : *శకుని* ఉ11.19 వరకు,
తదుపరి *చతుష్పాత్* రా10.07వరకు,
వర్జ్యం : *సా6.49 – 8.19,*
దుర్ముహూర్తము : *మ12.22 – 1.13,*
మరల *మ2.57 – 3.48,*
అమృతకాలం : *తె3.46 – 5.15,*
రాహుకాలం : *ఉ7.30 – 9.00,*
యమగండం : *ఉ10.30 – 12.00,*
సూర్యరాశి : వృషభం,
చంద్రరాశి : మేషం,
సూర్యోదయం : 5.29,
సూర్యాస్తమయం: 6.24,
*_నేటి మాట_*
*మానవునికి సుఖశాంతులు ఎలా లభిస్తాయి??*
కోరికలు మితంగా, హితంగా ఉన్నప్పుడు మానవునికి సుఖశాంతులు లభిస్తాయి…
ఈనాడు ప్రపంచములో కరవు, కాటకములకు కారణము ఏమిటి? చుట్టూ వుండిన ఆశలే మూలకారణము.
కూటి పేదనుండి కోటీశ్వరునివరకుకూడను యీ ఆశలు పెరిగిపోతున్నవి…
పండితుని మొదలు పామరునివరకు, బాలుని మొదలు వృద్ధునివరకు యీ ఆశలు పెరిగిపోతున్నవి.
‘ నేను గొప్ప గాయకుడు కావాలి, నేను గొప్ప నటుడు కావాలి, నేను గొప్ప వ్యాపారస్థుడు కావాలి, నేను గొప్ప అధికారిని కావాలి, నేను గొప్ప విద్యావంతుడను కావాలి’…
ఈ విధమైన కోరికలు చీమల పుట్టలవలె పెరిగిపోతున్నాయి, కోరికలు కోరడం ఆశ పడటంలో తప్పులేదు.
కానీ, మితిమీరిన ఆశలు ప్రమాదమును కలిగింపచేస్తాయి.
ప్రతి మానవునకు ఆహారము అవసరము.
అట్టి పవిత్రమైన ఆహారమును మితముగా భుజించినప్పుడు తనకది ఆరోగ్యమును అందిస్తుంది.
కాని, అతిగా భుజించినప్పుడు అదే విషముగా మారిపోతుంది.
కోరికలు మితమైనరీతిగా, హితమైనరీతిగా ఉండినప్పుడు మానవుడు శాంతి, సుఖములు అనుభవించగలడు.
ఈనాడు నాగరికత పెరిగినకొలది మానవత్వములోని మృదుత్వము, మధురత్వము క్షీణించిపోతున్నది.
ఆధునిక యుగము సుఖశాంతులను దూరము గావించుచున్నది.
వైజ్ఞానిక శాస్త్రము పెరిగిపోయినదని విఱ్ఱవీగుతున్నాము.
కాని, యిది వెట్టితనము, దీనివలన ఒనగూడే అనుకూలములు యేదో కొంతవరకు మనము అనుభవించవచ్చునేగాని అవి ఆత్మశాంతిని అందించలేవు. కార్లు వచ్చాయి.
వీడియోలు వచ్చాయి, ప్లేనులు వచ్చాయి, సినిమాలు వచ్చాయి.
అయితే వీటివల్ల మనశ్శాంతి లభిస్తున్నదా అంటే ఏదో కొంతవరకు మాత్రమే అనుకూలములు చేకూర్చవచ్చుకానీ, ఆత్మశాంతి వీటివల్ల లభించేది కాదు.
విజ్ఞానమునకు మనస్సనేది లేదు.
ఆత్మ అనేది అర్థమే కాదు, పవిత్రమైన హృదయము అసలే లేదు.
పవిత్ర మనస్సనేది లేనిదే విజ్ఞాన శాస్త్రము.
ఎప్పుడూకూడను పదార్ధము యొక్క పరిశోధన.
ఇట్టి పదార్ధ విజ్ఞానశాస్త్ర పరిశోధనయందే పవిత్రమైన తన మానవత్వమును వ్యర్ధము చేసుకుంటున్నాడు, మానవుడు.
దీనివలన పరమార్ధమైన దివ్యత్వమును మానవుడు అందుకోలేడు.
అసూయ, ద్వేషము, అహంకారము, యిలాంటి దుర్గుణములే అభివృద్ధిగాంచుతాయి.
*_☘️శుభమస్తు☘️_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏