2030నాటికి చైనా వద్ద 1000కి పైగా అణ్వస్త్రాలు: US నివేదిక..!

2030నాటికి చైనా వద్ద 1000కి పైగా అణ్వస్త్రాలు: US నివేదిక

సైనిక సంపత్తిని చైనా అత్యంత వేగంగా అభివృద్ధి చేస్తోందని US రక్షణ నిఘా సంస్థ (DIA) ఓ నివేదికలో పేర్కొంది. తిరుగులేని శక్తిగా కొనసాగేందుకు, USకు సవాలు విసిరేందుకు చూస్తోందని వివరించింది.

2030నాటికి 1000కి పైగా అణు వార్హెడ్లను ఆ దేశం నిల్వ చేస్తుందని అంచనా వేసింది. చైనాను భారత్ తమ ప్రధాన ప్రత్యర్థిగా పరిగణిస్తోందని, దీటుగా సైనిక శక్తిని అభివృద్ధి చేసుకుంటోందని DIA పేర్కొంది.