పాకిస్థాన్ ఏకైక లక్ష్యం భారత్తో శత్రుత్వం. భారత్ అంటే ద్వేషంతో మన దేశానికి హాని కలిగించాలనే తపనే ఉంటుంది…. ప్రధాని మోడీ..
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్ ప్రతీకారదాడులకు ప్రయత్నించగా, భారత సైన్యం వాటిని తిప్పికొట్టినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశ విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ భారత్తో శత్రుత్వమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆరోపించారు. గుజరాత్ పర్యటనలో భాగంగా దోహద్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ పాకిస్థాన్పై విరుచుకుపడ్డారు.
‘విభజన తర్వాత ఏర్పడిన పాకిస్థాన్ ఏకైక లక్ష్యం భారత్తో శత్రుత్వం. భారత్ అంటే ద్వేషంతో మన దేశానికి హాని కలిగించాలనే తపనే ఉంటుంది. కానీ, భారత్ లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించటం. ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయటం. అభివృద్ధి చెందటం. దేశ సైన్యం బలంగా ఉన్నప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. అప్పుడు మన ఆర్థికవ్యవస్థ బలంగా ఉంటుంది’ అని ప్రధాని మోదీ అన్నారు. అంతేకాకుండా 2014లో ఇదే తేదీన ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారని గుర్తు చేసుకున్నారు.