గుత్తి వంకాయ..సరదా తిండి ప్రియుడి మాటలు..

సరదా తిండి ప్రియుడి మాటలు.

ఎన్నిసార్లు వండినా కనులకు ఇంపు..

గుత్తి వంకాయ/దొండ/బీర/సిమ్లా మిర్చి కూర బాగుండాలి అంటే కూర కారం బాగుండాలి.
ఈ కూర కారానికి వెడల్పుగా ఉండే ఎర్రని మిరపకాయలు రాజమండ్రినుండి తెచ్చినవి వాడాను. వరంగల్ మిరపకాయ కూడా ఇలాగే గొడ్డుకారం కాకుండా రంగు, రుచి బాగుంటాయి.
25 మిరపకాయలు తొడిమలు తీసి, ముక్కలు చేసుకుని, ఉంచాలి.
100 గ్రాముల సెనగపప్పు, 50 గ్రాములు మినపప్పు, 20 గ్రాములు ధనియాలు, 10 గ్రాములు జీలకర్ర రెండు స్పూన్స్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు కాస్త నూనెలో వేయించాలి, మాడకూడదు. పప్పులు ఎర్రగా వేగాక మిరపకాయ ముక్కలు వేసి ఒకట్రెండు సార్లు బాగా కలిపి, వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి. పోపు చల్లారాక పెద్ద ఉసిరి కాయంత చింతపండు, ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇష్టమయితే ఎండుకొబ్బరి కోరు వేసుకోవచ్చు. కాయల పళంగా ఇలా చేయాలనుకుంటే ఒక కప్పులో కారాన్ని వేసుకుని దాన్ని కాస్త నూనెతో తడిపి తొడిమ వీడకుండ నాలుగు పక్షాలుగా చేసుకుని పుచ్చు, చచ్చు లేకుండా ఉన్న వంకాయలలో కూరుకోవాలి. ఇలా ప్రెషర్ పాన్ లో కాస్తా నూనె వేసి కూరుకున్న వంకాయలను ప్రెషర్ పాన్ లో పెట్టాక చిన్న గ్లాసులో సగం నీరు కాయలపైన చిలకరించి మూతపెట్టి ఒక్క విజిల్ రాగానే స్టౌ కట్టేయాలి. ఆవిరి పోయాక మూత తీసి మళ్లీ కాస్త నూనె వేసి కూర కిందామీద అయేలా కాస్త కుదపాలి లేదా అట్లకాడతో జాగ్రత్తగా కలపాలి. నోరు ఊరించే చిన్న సరదా సమావేశం