కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. కవిత స్పందన..

కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు.. కవిత స్పందన

TG: తన సోదరుడు కేటీఆర్తో విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో కవిత సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్కు ఏసీబీ నోటీసులపై తీవ్రంగా స్పందించారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపించారు. ACB నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర KCR సైనికులదని స్పష్టం చేశారు.