ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ అండ్ బ్యూటిపుల్ బిల్లుపై స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్Elon Musk తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు…ఈ బిల్లుకు అధికంగా ధనం ఖర్చు చేయడం తనకు అసంతృప్తిని కలిగించిందని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ బిల్లు కారణంగా అమెరికాలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్ ప్రభుత్వానికి లోటు బడ్జెట్ ను మిగులుస్తుందని తెలిపారు మస్క్.Elon Musk
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య గ్యాప్ వస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో మస్క్.. ట్రంప్ కు సపోర్ట్ చేశారు. ఆయనకు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టాక ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే ఎలాన్ మస్క్ సారథ్యంలో తీసుకొచ్చిన డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ(DOGE) నుంచి మస్క్ వైదొలిగినట్లు తెలుస్తోంది. తాజాగా ట్రంప్ తీసుకొచ్చిన బిల్లను ఆయన బహిరంగంగానే వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. దీంతో మస్క్ ,ట్రంప్ మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది.
ట్రంప్ బ్రెయిన్ ఛైల్డ్ గా చెప్పుకునే ఈ బిగ్, బ్యూటిఫుల్ బిల్లును రిపబ్లికన్ పార్టీ నేతల నుంచి ఆమోదం పొందింది. హౌస్ ఆఫ్ రెప్రజెంటేటివ్స్ దీన్ని ఆమోదించింది. ఒకే ఒక్క ఓటు తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం పొందడం పట్ల ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. అయితే తాజాగా ఈ బిల్లును మస్క్ వ్యతిరేకిస్తూ రావడంపై ఉత్కంఠ నెలకొంది….అమెరికాలో ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేందుకు ట్రంప్ డోజ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఎలాన్ మస్క్ కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వంలోని వృథా ఖర్చులు తగ్గించడం, ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడపడమే డోజ్ చేసే పని. అయితే ట్రంప్ సర్కార్ ఏర్పడిన కొత్తలో బాగానే పనిచేసింది డోజ్ వ్యవస్థ. ఆ తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు ఏకపక్ష నిర్ణయాలతో డోజ్ వ్యవస్థ నుంచి మస్క్ దూరం జరిగారు. మస్క్ దూరాన్ని ట్రంప్ కూడా ధృవీకరించారు.
మరోవైపు మస్క్ సైతం డోజ్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని అమెరికాలో లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగించడంలో కీలకంగా వ్యవహరించారు. అయితే గత కొంత కాలంగా మస్క్ కంపెనీలు భారీగా నష్టాలను చూస్తున్నాయి. దీంతో డోజ్ నుంచి వైదొలిగి వ్యాపారంపై దృష్టి పెట్టాలని మస్క్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య అభిప్రాయ బేధాలు తీవ్ర స్థాయికి చేరినట్లు తెలుస్తోంది..