పాక్ కోసం గూఢచర్యం (Spying) వ్యవహారం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు భారతీయులు అరెస్టైన విషయం తెలిసిందే..తాజాగా గూఢచర్యం అరోపణలతో కాంగ్రెస్ నేత వద్ద పనిచేసిన మాజీ పీఏని దర్యాప్తు అధికారులు అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్ వ్యక్తిగత సహాయకుడిగా పని చేసినట్లు తెలుస్తోంది. సకూర్ ఖాన్, కాంగ్రెస్ మాజీ మంత్రి సలేహ్ మహ్మద్ సొంత గ్రామం జైసల్మేర్ జిల్లా బరోడా..
రాజస్థాన్ (Rajasthan) రాష్ట్ర ఉపాధి కార్యాలయంలో పనిచేస్తున్న సకూర్ ఖాన్ మగళియార్ (Sakur Khan Mangaliya)ను సీఐడీ, ఇంటెలిజెన్స్ అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిది పాక్ సరిహద్దుల్లోని జైసల్మేర్ జిల్లా బరోడా గ్రామం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకి ఆయన కీలక సమాచారం చేరవేస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన ఇటీవలే ఆరు నుంచి ఏడుసార్లు పాక్కు వెళ్లి వచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు.
పాకిస్థాన్ రాయబార కార్యాలయ అధికారితో, పాక్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)తో అతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులకు సమాచారం అందింది. దీంతో నిఘా సంస్థలు కొంతకాలంగా అతనిని గమనిస్తున్నాయి. ‘సకూర్ అనుమానాస్పద కార్యకలాపాల గురించి ఉన్నత స్థాయి నుంచి మాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని నిర్ధారించుకుని, ప్రశ్నించేందుకే అతడిని అరెస్ట్ చేశాం’ అని ఎస్పీ సుధీర్ చౌధ్రీ మీడియాకు తెలిపారు. కాగా, సకూర్ ఖాన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రి అయిన షేల్ మొహమ్మద్కు వ్యక్తిగత సహాయకుడిగా (Congress leader ex aid)పనిచేశాడు. మొహమ్మద్, ఖాన్ ఒకే గ్రామానికి చెందినవారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..
ఏడు సార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు..
సకూర్ఖాన్పై డౌట్ రావడంతో దర్యాప్తు బృందాలు నిఘా పెట్టింది. ఇతని మొబైల్లో పాకిస్తానీ నంబర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం ఏడు సార్లు ఇతను పాకిస్తాన్ వెళ్లినట్లు కూడా అంగీకరించాడు. అయితే ఇతను మొబైల్ ఫోన్లో కొన్ని ఫైల్స్ను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు…