బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకు వస్తున్నారో చెప్పాలి..మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి.

ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు రెడీ చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్తున్నారు.. బిల్డింగ్ కడితే చదువు రాదు, గతంలో మా సిలబస్ కంటే ఏ మార్పు తీసుకు వస్తున్నారో చెప్పాలి…యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మీద ఒక్కోసారి ఒక్కో అంచనా పెంచుకుంటూ పోయారు

ముందుగా ఉపముఖ్యమంత్రి 80 కోట్లు అంచనా వేస్తే, తర్వాత ముఖ్యమంత్రికి గారు 100 కోట్లకు అంచనా పెంచారు.. మళ్లీ తర్వాత అదే ముఖ్యమంత్రి గారు 120 కోట్లు అని అంచనా పెంచారు.. ఇప్పుడు మళ్లీ అదే ముఖ్యమంత్రి 200 కోట్లు అంచనా పెంచారు

అసలు ఎందుకు అంచనా పెంచుకుంటు పోయారు.. అక్కడే మత్లబ్ ఏంటో చెప్పాలి.

ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీరు కడితే దాంట్లో ఎవరిని షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు.. గురుకులాల్లో ఉన్న పిల్లలనా, లేదా గవర్నమెంట్ పాఠశాలలో ఉన్న పిల్లలనా, లేదా కొత్త వాళ్ళను తీసుకు వస్తారా చెప్పాలి.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలకు మొదటిలో 80 కోట్లు వేసిన అంచనా ఇప్పుడు 200 కోట్లకు ఎందుకు పెరిగిందో చెప్పాలి

అసలు 80 కోట్ల నుండి 200 కోట్లకు ఎలా అంచనా పెంచారు అంటే క్లారిటీ ఇవ్వాలి ..