సీజన్లో అత్యంత కీలకమైన క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్ల ధాటికి పంజాబ్ కింగ్స్ (PBKS) బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైర్ కొనసాగుతోంది. అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కు షాక్ ఇచ్చింది..
11 ఓవర్లలోపే పంజాబ్ 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆర్సీబీ సూపర్ బౌలింగ్
ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ స్టేడియంలో ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో పంజాబ్-బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో పంజాబ్ మొదట బ్యాటింగ్ కు దిగింది.
పంజాబ్ టాపార్డర్ పరుగల వర్షం కురిపిస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటిది కనిపించలేదు. బెంగళూరు నిప్పులు చెరిగే బౌలింగ్ తో పంజాబ్ టాపార్డర్ ను పెవిలియన్ కు పంపింది. పెద్దగా పరుగులు చేయకుండా అడ్డుకుంది. ఆర్సీబీ సూపర్ బౌలింగ్ తో పంజాబ్ టీమ్ 9 ఓవర్లలోపే 7 వికెట్లు కోల్పోయింది. మరో ఓవర్ ముగిసిన తర్వాత 8వ వికెట్ గా స్టోయినీస్ అవుట్ అయ్యాడు..
RCB ఘన విజయం: స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఫిల్ సాల్ట్ (27 బంతుల్లో 56 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 10 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, IPL 2025 ఫైనల్‌కు దూసుకెళ్లింది.
లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచి, 11 ఏళ్ల తర్వాత ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్, కీలకమైన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం అభిమానులను నిరాశపరిచింది. శ్రేయాస్ అయ్యర్, రికీ పాంటింగ్ మధ్య జరిగిన ఈ తీవ్రమైన చర్చ, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో ఉండే తీవ్ర ఒత్తిడిని, ఓటమి పరిణామాలను ప్రతిబింబిస్తుంది. పంజాబ్ కింగ్స్‌కు ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఓటమి వారి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు..
ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 పంజాబ్ జట్టు ప్లేయింగ్ XI
ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్‌ప్రీత్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, కైల్ జామీసన్.
పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ సబ్: విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, ముషీర్ ఖాన్, జేవియర్ బార్ట్లెట్.
ఐపీఎల్ 2025 సీజన్ క్వాలిఫయర్ 1 బెంగళూరు జట్లు ప్లేయింగ్ XI
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇంపాక్ట్ సబ్: మయాంక్ అగర్వాల్, రసిఖ్ సలామ్, మనోజ్ భాండాగే, టిమ్ సీఫెర్ట్, స్వప్నిల్ సింగ్.