భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు..!

తగులుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన ఎన్ కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందడం తెలిసిందే. తాజాగా మరో మావోయిస్టు అగ్రనేత హతమయ్యారు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్రస్థాయిలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ (45) మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుడు భాస్కర్ స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా, బోథ్‌ మండలం పరిధిలోని పొచరా గ్రామంగా గుర్తించారు..

చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌జిల్లాలో నేషనల్‌ పార్క్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు ఆదెల్లు అలియాస్ భాస్కర్ మృతి చెందారు. అతడి స్వస్థలం తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం పొచరా. భాస్కర్‌పై రూ. 25లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో ఏకే-47ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్‌, కోబ్రా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయి…