జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం….విలాసవంతమైన నిర్మాణానికి..

జామ్‌నగర్‌లో అక్రమ మత కట్టడం….విలాసవంతమైన నిర్మాణానికి

ఒక ప్రత్యేక గదిలో అత్యాధునికమైన బాత్‌టబ్ కూడా ఉంది. ఆ బాత్‌టబ్ ఉన్న గది తలుపుపై ‘బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు’ అని రాసి ఉన్న ఓ నోటీసును అంటించి ఉండటం గమనార్హం. ఈ మతపరమైన స్థలంలో ఎలాంటి కానుకలు గానీ, డబ్బు గానీ స్వీకరించబోమని తెలిపే ఓ ప్రకటన కూడా ఉంది. ఇంతటి విలాసవంతమైన నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ఈ అక్రమ మతపరమైన స్థలం యజమానులు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకోవడానికి పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారని ఎస్పీ ప్రేమసుఖ్ డేలు తెలిపారు..

వెలుగులోకి వచ్చిన ఓ అక్రమ మతపరమైన నిర్మాణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.విలాసవంతమైన సౌకర్యాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.నగరంలోని బచ్చునగర్ (Bachunagar) అనే ప్రాంతంలో 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ కట్టడంలో స్విమ్మింగ్ పూల్, అధునాతన బాత్‌టబ్, విశాలమైన గదులు వంటి అనేక విలాసవంతమైన వసతులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు.దీనిని అధికారులు ఇతర అక్రమ కట్టడాలతో పాటు కూల్చివేశారని పోలీసులు తెలిపారు..