ఆర్మీలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్‌

ఆర్మీలో ఉద్యోగాల పేరుతో మోసం.. నిందితుడు అరెస్ట్‌
తెలంగాణ : ఆర్మీలో ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితుడిని తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన ఆశీష్‌ కుమార్‌ హైదరాబాద్ లో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు. ఆర్మీ క్యాంటీన్‌లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బిహార్‌లోని 20 మంది మహిళల నుంచి డబ్బు వసూలు చేశాడు. వారిలో ఇద్దరిని ఆర్మీ క్యాంటీన్‌‌కు అనుమతి లేకుండా తీసుకెళ్లాడు. వారిని భ్రదతా సిబ్బంది పట్టుకొని పోలీసులకు అప్పజెప్పారు.