అసలు తాడేపల్లి లో జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఏమి జరుగుతోంది…. తాటికాయతో ఇంటిపై దాడి…
ఈ రోజు రాత్రి 8 గంటలకి అ కార్ ఆగి అందులో నుంచి 5 మంది దిగి మూడు సార్లు హారన్ కొట్టినట్లు సమాచారం . అక్కడ ఉన్న ఒకే ఒక్క గార్డ్ బైటికి వచ్చి అడిగి ఈ పిక్ తీసిన అభిమాని పరిగెట్టి గొడవ పెట్టుకునే లోపు వెళ్లిపోయారు .
మొన్న కూడా ఇంటి ముందే తాటి కాయలు విసిరి వెళ్లారు . ఒక పార్టీ అధినేత ఒక ఎక్స్ సీఎం కి కల్పించే భద్రత ఇదేనా . అంటూ YSR cp శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో… ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టేరు…
అది అనుకోకుండా జరిగిన ఘటనని, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని పోలీసులు వివరిస్తున్నారు.. దీంతో వైఎస్ఆర్సిపి మరికాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఉద్దేశపూర్వకంగా చేయకపోతే ఎక్కడో దొరికిన తాటికాయని కారులో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఎందుకు వస్తారు అంటూ ప్రశ్నిస్తున్నారు.