నేటి పంచాంగం…

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌻పంచాంగ🌻
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 29 – 06 – 2025,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *చవితి* ఉ11.50 వరకు,
నక్షత్రం : *ఆశ్రేష* ఉ9.36 వరకు,
యోగం : *వజ్రం* రా9.29 వరకు,
కరణం : *భద్ర* ఉ11.50 వరకు,
తదుపరి *బవ* రా11.49 వరకు,

వర్జ్యం : *రా9.56 – 11.35*
దుర్ముహూర్తము : *సా4.49 – 5.41,*
అమృతకాలం : *ఉ8.00 – 9.36,*
రాహుకాలం : *సా4.30 – 6.00,*
యమగండం : *మ12.00 – 1.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : కర్కాటకం,
సూర్యోదయం : 5.31,
సూర్యాస్తమయం: 6.34,

*_నేటి మాట_*

*ఈ మాయా ప్రపంచం లో – పంచాక్షరి మహా మంత్రం ఏమిటి??*

*_”దేవుడున్నాడు “_*
ఈ సృష్టి క్రమాన్ని పరిశీలిస్తే అర్ధమయ్యేది, ఏమిటంటే ఈ సృష్టి కి మూలాధార మైనది ‘మహత్తు’ అంటాము, *అదే దైవం*…
ఆ దైవశక్తే తన దివ్య శాసనాన్ననుసరించి, సృష్టి స్థితి, లయములను నడుపుతోంది.
జరిగేది సర్వం దైవసంకల్పమే, స్వయం కృషితో పైకి వచ్చానని గర్వపడకు, బాగా పరిశీలిస్తే, భగవంతుని అదృశ్య హస్తం గోచరిస్తుంది…
దేవుడున్నాడు, దేవుడున్నాడు, దేవుడున్నాడని సతతం స్మరించు, అదే పంచాక్షరి మహా మంత్రం…
అలా స్మరిస్తుంటే ఆయన నీలోనే ఉన్న అనుభవం కలుగుతుంది.
సుఖాలలో దైవాన్ని విస్మరించి, కష్టాలలో శాంతి వ్రతాలు చేయడం అవివేకం.

కష్టాలకు కృంగకు,
అదినీకర్మ ఫల ప్రక్షాళన గా భావించు,
దైవ విశ్వాసము ఉంటే అది భరించే శక్తి నీకు వస్తుంది, బాగా తెలుసుకో, నీకున్న నిస్వార్థ బంధువు భగవంతుడు ఒక్కడే.

ఈ ప్రాపంచిక బంధములన్నీ ఇచ్చి పుచ్చుకోవడం అనే వ్యాపార సూత్రం మీద ఆధారపడినవే, అంతే కానీ ఏదీ శాశ్వతం కాదు, భగవంతుడు ఒక్కడే శాశ్వతం.

*_🌻శుభమస్తు🌻_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏