తెలంగాణలో ఈ జిల్లాల్లో వర్షాలు..
▪️తెలంగాణలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదివారం రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడుతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.