🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 09 – 07 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
శుక్ల పక్షం,
తిథి : *చతుర్దశి* రా1.02 వరకు,
నక్షత్రం : *మూల* తె5.09 వరకు,
యోగం : *బ్రహ్మం* రా11.09 వరకు,
కరణం : *గరజి* మ12.26 వరకు,
తదుపరి *వణిజ* రా1.02 వరకు,
వర్జ్యం : *ఉ11.57 – 1.40*
మరల *తె3.26 – 5.09,*
దుర్ముహూర్తము : *ఉ11.38 – 12.30,*
అమృతకాలం : *రా10.16 – 11.59,*
రాహుకాలం : *మ12.00 – 1.30,*
యమగండం : *ఉ7.30 – 9.00,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.35,
సూర్యాస్తమయం: 6.35,
*_నేటి విశేషం_*
*సింహాచలంలో – గిరిప్రదక్షిణ*
*సింహాచలంలో గిరి ప్రదక్షిణ*
*సింహాచలంలో గిరి ప్రదక్షిణ , 32 కిలో మీటర్ల మేర జరిగే ఉత్సవం*
సింహాచలంలో సింహాద్రి అప్పన్నగా పిలిచే శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ 32 కిలో మీటర్ల మేర లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణలో కాలి నడకన చేరుకుంటారు.
గిరి ప్రదక్షిణ ప్రారంభోత్సవానికి ముందు ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ కార్యక్రమాన్ని ధర్మకర్త , ఆలయ కార్యనిర్వహణాధికారి కొబ్బరికాయ కొట్టి , జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు.
రథంతో పాటు నడిచి గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు, అక్కడ నుంచి మెట్ల మార్గంలో సింహగిరి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.
భక్తులంతా పాదాల కొండ దగ్గర ఉన్న విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి తమ ప్రదక్షిణ ప్రారంభిస్తారు.
రథం ముందు చాలా మంది వాలంటీర్లు నృత్యం చేస్తారు.
*గిరి ప్రదక్షిణ మార్గం*
గిరి ప్రదక్షిణ రోజున పుష్ప రథం యాత్ర వెనుక లక్షలాది మంది ప్రజలు నడుస్తారు. 32 కిలో మీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణ విశాఖపట్నం ప్రధాన ప్రాంతాల్లో సాగుతోంది.
ఈ గిరి ప్రదక్షిణలో ఆంధ్రప్రదేశ్తో పాటు తమిళనాడు , కర్ణాటక , ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి పాల్గొంటారు. గిరి ప్రదక్షిణ సింహాచలం కొండ పాదాల వద్ద ప్రారంభం అవుతుంది.
అక్కడ నుంచి జైలు రోడ్డు మీదుగా అడవివరం , ఆరిలోవ , హనుమంతవాక , జోడుగుళ్ల పాలెం బీచ్ , మాధవధార , ఎన్ఏడీ జంక్షన్ , గోపాలపట్నం మీదుగా తిరిగి సింహాచలం ఆలయానికి చేరుకుంటుంది.
*స్థలపురాణం :*
ఈ సింహాచలం దివ్యక్షేత్రం స్థలపురాణం లోతుల్లోకి వెళితే లోకాలను భయకంపితుల్ని చేసిన రాక్షసరాజులు , సోదరులైన హిరణ్య కశిప , హిరణ్యాక్ష సోదరుల కాలం నాటిది.
హిరణ్యాక్షుడు భూమండలాన్ని ఆక్రమించుకొని హింసని ప్రజ్వలిమ్పచేసినపుడు ఆ మహావిష్ణువు వామనావతారధారిగా అవతరించి హిరణ్యాక్షుడిని వధించి భూమండలాన్ని రక్షించాడు.
తన సోదరుడైన హిరణ్యాక్షుడి మరణాన్ని సహించలేని హిరణ్యకశిపుడు మహావిషునువుపై కక్ష సాధనకై బ్రహ్మ మెప్పు కొరకై కఠోర తపస్సు చేయసాగాడు.
ఇంతలో బ్రహ్మ ప్రత్యక్షమై హిరణ్యకశిపుని కోరిక సాధ్యపడదని సెలవిచ్చాడు. హిరణ్యకశిపుడు తేరుకొని తనకు జంతువుతో గాని మనిషితో గాని , పగలు కానీ రాత్రి కాని , ఆకాశంలో కాని భూమిపై కాని మరణం లేకుండా బ్రహ్మ దేవుణ్ణి వరం కోరి పొందాడు.
హిరణ్యకశిపుడు తనకు చావే లేదని గర్వితుడై , భూమండల వాసులంతా తననే పూజించాలని వేధించడం ప్రారంభించాడు. అంతే కాకుండా దేవతలను , మునులను , విష్ణు భక్తులను వేధించసాగాడు.
విధి వైచిత్రి , హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుడు పుట్టుకతో విష్ణు భక్తునిగా జన్మించాడు. “నారాయణ” నామ జపంతో అనునిత్యం విష్ణు ఆరాధనలో ఉండటం హిరణ్యకసిపునికి ఆగ్రహం తెప్పించి ఎన్ని విధాల ప్రయత్నించినా ప్రహ్లాదుని విష్ణుభక్తిని కించిత్తు మార్చలేకపోతాడు.
హిరణ్యకశిపుడు అసహనానికి గురై మదగజాలతో తొక్కించినా , విషసర్పాలతో మధ్యలో పడేసినా ప్రహ్లాదుడు లొంగలేదు. సరి కదా నారాయణ నామ స్మరణతో అడ్డంకుల్ని ప్రహ్లాదుడు అధిరోహించడం హిరణ్యకసుపుని అగ్రహజ్వాలల్ని మరింత రగిలించింది.
చివరిగా ప్రహ్లాదుడిని సముద్రంలో తోసి అతనిపై ఓ పర్వతాన్నుంచమని తన భటులను అజ్ఞాపించాడు. భటులు ప్రహ్లాదుడిని సింహాద్రి పర్వతం పైకి ఎక్కిస్తారు. అక్కడినుండి సముద్రంలోకి ప్రహ్లాదుడిని విసిరి వేసి ఆపై సింహాద్రి పరవతాన్ని పెకిలించి అతనిపై ఉంచాలని వారి ఆలోచన. అంతలో మహావిష్ణువు సింహాద్రి కొండపైకి ఉరికి వచ్చి ప్రహ్లాదుడిని కాపాడారు.
అందుచే సింహాద్రి పర్వతం ప్రహ్లాదుడిని మహావిష్ణువు కాపాడిన ప్రాంతంగా గుర్తింపు పొందింది.
తన భక్తుడైన ప్రహ్లాదుని కోరికమేరకు మహావిష్ణువు ,
హిరణ్యకశిపుని సంహరించిన వరాహావతారం మరియు హిరణ్యాక్షుడిని సంహరించిన నృసింహావాతారముల కలబోతగా వరహనృసింహంగా అవతరించి సింహాచలం దివ్యక్షేత్రంలో కొలువై ఉన్నారు.
*సింహాచలం దివ్యక్షేత్రం ఆలయ చరిత్ర :..*
తన తండ్రి మరణానంతరం ప్రహ్లాడుడే వరహనరసింహ స్వామి ఉత్సవామూర్తికి తొలిగా ఆలయ నిర్మాణం చేపట్టారని , కృతయుగం ఆఖరులో ఆలయం శిధిలావస్తకు చేరుకుందని తెలుస్తోంది.
అయితే తరువాతి కాలంలో రాజ పురురావ తన సతీమణి ఊర్వశితో విహారానికి గుర్రాలపై వెళ్ళగా అతను సింహాచలం దివ్యక్షేత్రం వైపు ఆకర్షింపబడి బురదలో కూరుకుపోయిన వరహనరసింహ స్వామి విగ్రహాన్ని శుభ్రం చేస్తుండగా ఆకాశవాణి స్వామి వారి నిజరూపాన్ని బయట చేయరాదని చందనం పూత పూయాలని సంవత్సరంలో ఒకసారి వైశాఖ మాసం మూడవరోజున మాత్రమే నిజరూప దర్శనం చేయించాలని వినిపించగా
రాజ పురురావ స్వామి వారి విగ్రహం పైనుంచి తొలగించిన బురద స్థానంలో చందనం పూత పూయించిన నాటి నుండి నేటి వరకు వరహనరసింహ స్వామి వారి సింహాచలం దివ్యక్షేత్రం అప్రతిహతంగా భక్తుల నీరాజనాలను అందుకొంటూనే ఉంది. అప్పట్లోనే రాజా పురురవ ఆలయాన్ని పునర్నిర్మించారని స్థలపురాణం చెపుతోంది.
స్వామి వారి నిజరూప దర్శనం ఒక్క అక్షయ తృతీయ నాడే లభిస్తుంది.
ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు నాటి శిలాఫలకాలు ఉన్నవి.
అయితే కళింగ రాజ్యాన్ని గెలుపొందిన చోళరాజు కులోత్తుంగ-1 కాలం నాటికే ఈ దివ్యక్షేత్రం ప్రముఖంగా వేలుగొందినట్లు చారిత్రిక ఆధారాలు చెపుతున్నాయి.
శ్రీక్రిష్ణదేవరాలు వారు , తన సతీమణి తో కలసి స్వామి వారికీ 991 ముత్యాలను మరియు ఇతర విలువైన ఆభరణాలను సమర్పించారని శాసనాలు చెపుతున్నవి.
*సింహాచలం దివ్యక్షేత్రం విశిష్టతలు*
ఈ ఆలయ నిర్మాణం ఇప్పటికి ఎన్నో విశిష్టతలను కలగి ఉంది. పెద్ద గోపురం , 16 స్థంబాల ముఖమండపం , వైష్ణవేటి పురాణాల ఆదారంతో హృద్యంగా చెక్కబడిన కళాకృతులు , భక్తుల కోరిన కోర్కెలు తీర్చే కప్పస్తంభం , విశాలమైన వరండా వేటికవే ప్రత్యేకతలను సంతరించుకున్నాయి.
ఆలయానికి ఉత్తరాన ఉన్న నాట్యమండపం మరొక ఆకర్షణ. ఈ మండపం 96 స్థంబాలను కలిగి ఉన్నది.
*కప్ప స్థంభం :*
ఈ స్థంభం అంతరాలయంలో ఉన్నది. ఈ స్తంభం నిర్మలమైన మనస్సుతో ప్రార్ధించే భక్తుల కోరిన కోర్కెలు తీరుస్తుందని విశ్వాసం. ఈస్తంభం లోపల సంతనగోపల యంత్రం ప్రతిష్టిమ్పబడిందని అందుచే భక్తులకోరిన కోర్కెలు తీర్చే శక్తి కప్పస్తంబానికి వచ్చిందని నమ్మకం. పిల్లలు లేని జంటలు ఈ స్థంబాన్ని ఆలింగనం చేసుకుంటే సంతానం కలుగుతుందని ప్రతీతి.
*గంగధార :*
కొండల పైనుంచి ఔషధ వృక్షాల వేర్లను తాకుతూ వచ్చే ఈ స్వచ్చమైన జలధారా ప్రవాహం వద్ద యాత్రికులు ఎంతో విశేష నమ్మకంతో శిరస్నామాచారిస్తారు. ఇలా చేస్తే వారి రోగాలు పోయి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం.
సింహాచలం దివ్యక్షేత్రంలో స్వామి వారికి నిర్వహించే వార్షిక పూజాది కార్యక్రమాలు :
ఉగాది నాడు నిర్వహించే పందిరి రాట ఉత్సవం. (చైత్ర శుద్ధ పాఢ్యమి) స్వామి వారిని పెళ్ళికొడుకుగా అలంకరిస్తారు.
వైశాఖ శుక్ల చతుర్ధశి నాడు స్వామి వారి జయంతోత్సవం నిర్వహిస్తారు.
స్వామి వారు వివాహానికి బయలుదేరేముందు రథోత్సవం నిర్వహిస్తారు.
చైత్ర శుద్ధ దశమి నుండి చైత్ర శుద్ధ పౌర్ణమి వరకు స్వామి వారి కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
*చందనయాత్ర లేదా చందనోత్సవం :*
వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ నాడు స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. ఈ నిజ రూప దర్శనం సందర్భంగా భక్తుల తాకిడి తెల్లవారు ఝామునుండే ప్రారంభమవుతుంది.
సుమారుగా రోజంతా లక్షకు పైచిలుకు భక్తులు హాజరవుతారని దేవాలయ అధికారులు చెబుతున్నారు. నిత్యం నాలుగు పూతల చందనంతో కనిపించే స్వామి ఈరోజు పరిమిత సమయం నిజరూప దర్శనం తరువాత తొలి చందనపు పూత పూస్తారు.
ఈరోజే చందనయాత్ర లేదా చందనోత్సవంగా పిలువబడుతుంది.
*_🌺శుభమస్తు🌺_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏