వాట్సప్ గ్రూపుల ద్వారా వేధించినా జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లే. ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలు.
వాట్సప్ గ్రూపుల ద్వారా వేధించినా జూనియర్లను ర్యాగింగ్ చేసినట్లే.
ఉన్నత విద్యా సంస్థలకు యూజీసీ ఆదేశాలు.
విద్యా సంస్థల్లో చేరిన నూతన విద్యార్థులను వాట్సప్ గ్రూపుల ద్వారా సీనియర్లు వేధింపులకు గురిచేసినా ర్యాగింగ్ చేసినట్లుగానే పరిగణించాలని ఉన్నత విద్యా సంస్థలకు విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) స్పష్టం చేసింది. అలాంటి వేధింపులకు కారణమైన వారిపై ర్యాగింగ్ నిరోధక నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, ఈ విషయంలో రాజీపడరాదని పేర్కొంది. ర్యాగింగ్ను అడ్డుకోవడంలో విఫలమైన విద్యా సంస్థలకు నిధులు నిలిపివేస్తామని, దీంతో పాటు ఇతర చర్యలూ ఉంటాయని హెచ్చరించింది.