ఓ టీవీ డిబెట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు. కెమెరా ఉందన్న సోయి కూడా మరిచిపోయారు. మాటమాట పెరగడంతో ఊగిపోయారు. ఒకరిపై కూడా ఒకరు దాడి చేసుకున్నారు..ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మధ్య ప్రస్తుతం రాష్ట్రంలో సవాళ్ల పర్వం నడుస్తోంది. అయితే దీనిపై ఓ ప్రముఖ ఛానల్ టీవీ చర్చ నిర్వహిచింది..
చర్చ జరుగుతూ ఉండగా..
అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీతో పాటుగా బీఆర్ఎస్ ఇతర పార్టీల నేతలను కూడా డిబేట్ కు పిలిచారు. ఈ క్రమంలో చర్చ జరుగుతూ ఉండగా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటమాట పెరిగింది. దీంతో ముందుగా కాంగ్రెస్ నేత దేవని సతీష్.. బీఆర్ఎస్ నేత గౌతమ్ ప్రసాద్ పై చేయి లేపారు. దీంతో కోపంతో ఊగిపోయిన గౌతమ్ .. సతీష్ పైకి దాడికి దిగాడు. దీంతో ఇరువురు ఎవరీ మాట వినకుండా ఒకరిపైకి మరోకరు దాడికి పాల్పడ్దారు. కెమెరా ముందే తన్నుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.