🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,
తేదీ … 11 – 07 – 2025,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
ఉత్తరాయనం,
గ్రీష్మ ఋతువు,
ఆషాఢ మాసం,
బహుళ పక్షం,
తిథి : *పాడ్యమి* రా2.02 వరకు,
నక్షత్రం : *పూర్వాషాఢ* ఉ6.37 వరకు,
యోగం : *వైధృతి* రా10.08 వరకు,
కరణం : *బాలువ* మ1.55 వరకు,
తదుపరి *కౌలువ* రా2.02 వరకు,
వర్జ్యం : *మ2.53 – 4.33,*
దుర్ముహూర్తము : *ఉ8.11 – 9.03,*
మరల *మ12.31 – 1.23*
అమృతకాలం : *రా12.50 – 2.29,*
రాహుకాలం : *ఉ10.30 – 12.00,*
యమగండం : *మ3.00 – 4.30,*
సూర్యరాశి : మిథునం,
చంద్రరాశి : ధనుస్సు,
సూర్యోదయం : 5.35,
సూర్యాస్తమయం: 6.35,
*_నేటి మాట_*
*మానవునికి మరు జన్మ అంటూ వుంటుందా???*
ఎవరికీ ఏమీ ఇయ్యని కారణముగా మానవుడు దరిద్రుడై పుడతాడు.
దరిద్రుడై పుట్టి జీవనము కొరకు చేయరాని పనులు చేస్తూ పాపమును ప్రోగు చేసుకుంటాడు.
పాప ఫలితమున ఘోర నరకమున పడి భయంకర శిక్షలను అనుభవించి మరలా దరిద్రుడై పుట్టి మరలా పాపాలను చేస్తాడు..
ఈ చక్రం అనంతముగా తిరుగుతూ ఉంటుంది…
కనుక ఉన్నంతలో ఎంతో కొంత పేదలకు, దీనులకు పంచి పెట్టాలి.
మన శక్తి మేరకు పరులకు సహాయ సహకారాలు అందించాలి.
భగవంతుడు ఏ రూపము ధరించైనా మన సహాయాన్ని కోరి రావచ్చును.
మనుష్య రూపం లేదా జంతువులు, పక్షులు ఇలా ఏ రూపంలోనైనా ఆయన మనలను పరీక్షించవచ్చును. అన్నింటికీ మనం సిద్ధపడి ఉండాలి.
సహాయం చేయగలిగే స్తోమత ఉండి కూడా ఎవరికి కాదు, లేదు అనకూడదు.
ఎవరికి ఏ సహాయం చేసినా అంతా భగవంతునికే చెందుతుంది అనే భావనతో చేయాలి.
అదే నిజమైన దైవ సేవ, నిజమైన దైవ సేవ చేసినవాళ్లకు మరుజన్మ అంటూ ఎదీ ఉండదు.
*_🌹శుభమస్తు🌹_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏