*మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి ప్రెస్ మీట్ తెలంగాణ భవన్లో
నిన్న రేషన్ కార్డుల పంపిణీ పేరు మీద తుంగతుర్తి లో ప్రభుత్వ ఖర్చు తో సభ కు జనాలను తీసుకొచ్చారు
అది పూర్తిగా అధికారిక కార్యక్రమం
…నేను రేవంత్ రెడ్డి స్థాయికి దిగజారను
సీఎం ఎంత మొత్తుకున్నా సభ లో జనం నుంచి స్పందన లేదు
సీఎం అబద్దాలు మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు స్పందిస్తారు ?
సీఎం లేని గొప్పలు చెప్పుకోవడం సిగ్గు మాలిన చర్య
బూతులు తిడితేనైనా స్పందిస్తారని సీఎం బూతులకు తెగ బడ్డారు
సీఎం కు సంస్కారం ,బుద్ది పెరగలేదు
సీఎం మాట్లాడిన మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు
కేసీఆర్ హయం లో రేషన్ కార్డులు ఇవ్వలేదని సీఎం అబద్దాలు మాట్లాడారు
జూలై 2021 లో ప్రతి పక్ష నేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గం లో రేషన్ కార్డులు పంచినట్టు అప్పట్లో ట్వీట్ చేశారు
ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గా బీ ఆర్ ఎస్ లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు
చౌటుప్పల్ లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షం లో నేను రేషన్ కార్డులు పంచాను
6.47 లక్షల రేషన్ కార్డులను కేసీఆర్ హాయం లో పంచాం
నా వాదన ను తప్పని నిరూపిస్తే చెంప దెబ్బ కొట్టించుకోవడానికి సిద్ధం
కాంగ్రెస్ నేతలు చెంప దెబ్బలు తినడానికి సిద్ధం కావాలి
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్ని యేండ్లు అవుతున్నా రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూడటం ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ వైఫల్యం వల్ల కాదా ?
గతం లో కేసీఆర్ జిల్లా పర్యటనలకు వచ్చినపుడు కొత్త కార్యక్రమాలు ప్రకటించే వారు
..నిన్న సీఎం తుంగతుర్తి లో తిట్లు తప్ప ఏమీ ఇవ్వలేదు
కాంగ్రెస్ టీడీపీ పాలన వల్లే నల్లగొండ లో ఫ్లోరోసిస్ మహమ్మారి 2 లక్షల మందిని కబళించింది
నీళ్ల విషయం లో అన్యాయం చేసి మళ్ళీ ఏవో చెబుతున్నారు
మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించే నల్లగొండ ను 40 లక్షల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా ?
వ్యవసాయాన్ని నల్లగొండ జిల్లా లో కేసీఆర్ పండగ లా మార్చాం
కాంగ్రెస్ పాలన వచ్చాక ఒక్క ఎకరాకు అయినా అదనం గా నీరొచ్చిందా ?
నల్లగొండ జిల్లాకు వచ్చిన కాళేశ్వరం జలాలకు కేసీఆర్ హారతి ఇచ్చిన దృశ్యాలు చూడలేదా ?
మూడు మెడికల్ కళాశాలలు జిల్లాకు తెచ్చింది కేసీఆర్ కాదా ?
యాదాద్రి ని అద్భుత దైవ క్షేత్రంగా తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ?
ఎన్నికల కోసం వేసిన రైతు భరోసా పాతది .యాసంగి ది వానా కాలం ది వేయాలి
రైతాంగానికి ఇంకా 27 వేల కోట్ల రూపాయలు రేవంత్ ప్రభుత్వం బాకీ ఉంది
కాంగ్రెస్ టీడీపీ పాలన లో నల్లగొండ పల్లెల పరిస్థితి ఎలా ఉండేది ..కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో ప్రజలకు తెలియదా ?
నిన్న కూడా తుంగతుర్తి లో సీఎం వచ్చే కన్నా ముందు కూడా కాంగ్రెస్ నేతలు తన్నుకున్నారు
మళ్ళీ ఫ్యాక్షన్ రోజులు తెస్తున్నారు
.కేసీఆర్ పాలన లో నల్లగొండ లో ఎలాంటి రాజకీయ కక్షలకు సంబంధించిన కేసులు లేవు
పదేళ్ల పాలన లో మాది నీళ్ల కోసం ఆరాటం ..ఇపుడు కమీషన్ల కోసమే కాంగ్రెస్ నేతల ఆరాటం
కార్యక్రమం ఏది అని చూడకుండా రేవంత్ అన్ని పాత్రలు తానే వేస్తున్నాడు
రేవంత్ చర్యలు వీధీ బాగోతాలను మించి పోయాయి
కాళేశ్వరం సాక్షిగా నేను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నా
కేసీఆర్ కు మూడు రోజులు టైమ్ ఇస్తే కన్నెపల్లి పంప్ హౌజ్ మోటార్లు ఆన్ చేసి చూపిస్తాం
ఏ పంప్ హౌజ్ ల దగ్గరైనా చర్చ పెడదాం
కాళేశ్వరం లో అన్నీ బాగానే ఉన్నాయి .ఏవీ కులాలేదని నిరూపిస్తాం
గోదావరి ని కావాలనే ఎండబెడుతున్నారు
సీఎం వచ్చినా సరే ,మంత్రి వచ్చినా సరే రైతు సమక్షంలో చర్చకు సిద్ధం
కాళేశ్వరం ఎవరిది తప్పయితే రైతు చేతిలో చెంప దెబ్బ తిందాం
మహిళలకు వడ్డీ లేని రుణాలు ,ఉద్యోగాల భర్తీ విషయం లో రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే
రేవంత్ స్థాయికి దిగజారి నేను మాట్లాడాలని కొందరు కోరుకుంటున్నారు .నేను అలా చేయను
రేవంత్ మాట్లాడింది ప్రతిదీ అబద్దమని సాక్ష్యాలతో నిరూపించా
నేను సోడా కలిపానో ,నీళ్లు కలిపానో పక్కన బెట్టు ..రేవంత్ లాగా గురు దక్షిణ కింద క్రిష్ణా ,గోదావరి జలాలను కిందకు తరలించలేదు
బనక చర్ల పై చంద్రబాబు రాసిచ్చిన వాక్యాలనే రేవంత్ చదువుతున్నారు
తాను ఏదీ మాట్లాడినా రాసే ,చూపే భాజా బజంత్రీ మీడియా ఉందనే అహంకారం తో రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
నల్లగొండ జిల్లాల్లో కాంగ్రెస్ మహామహులనే మట్టికరిపించా .భవిష్యత్ లో కూడా నేనేంటో నిరూపిస్తా
నల్లగొండ జిల్లా లో రేవంత్ తెలంగాణ సాయుధ పోరాట వీరుల పేర్లు తీసుకున్నారు .వారంతా పోరాడింది కాంగ్రెస్ జమీందార్ల మీదే
ఒక్కో సారి మనం ఎంత మంచిగా పంట సాగు చేసినా పంట కంటే లొట్ట పీసు చెట్లే ఎక్కువ గా మొలుస్తాయి
ఇపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రూపం లో నల్లగొండ జిల్లా లో లొట్ట పీసు చెట్లు మొలిచాయి
నా ఆస్తులు రేవంత్ ఆస్తుల గురించి మీడియా నే నా గ్రామం ,రేవంత్ గ్రామం వెళ్లి విచారణ చేయాలి
సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత తో మాట్లాడితే మంచిది
నల్లగొండ జిల్లా లో ఇపుడు ఎన్నికలు పెట్టినా బీ ఆర్ ఎస్ అన్ని స్థానాలు గెలుచుకుంటుంది
ఎన్నికలు వచ్చినపుడు ఎవరి సంగతి ఏమిటో ప్రజలే తేలుస్తారు .కాంగ్రెస్ ఎంత రెచ్చగొట్టినా మేము రెచ్చిపోము
మేము 25 యేండ్లుగా సంయమనమే పాటిస్తున్నాం
స్వీయ నియంత్రణ అవసరమని నిన్న సుప్రీం కోర్టు కూడా చెప్పింది అన్నారు..