*సూర్యాపేట జిల్లా..*
కాళేశ్వరంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్..
వేలాదిగా స్వచ్చందంగా తరలివచ్చిన రైతులు..
కెసిఆర్ కట్టిన ప్రాజెక్టును కళ్ళకు కట్టినట్టు వివరించిన జగదీష్ రెడ్డి
సుమారు రెండు గంటలపాటు కొనసాగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్
అధ్యంతం ఆసక్తిగా వీక్షించిన సూర్యాపేట రైతాంగం..
*మాజీమంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్..*
చర్చకు సిద్ధమా.. రేవంత్..
సూర్యాపేటకు నీళ్ళొచ్చాయో లేదో రైతుల వద్దకే వెళ్లి తెలుసుకుందామా..
దమ్ముంటే రా.. చిన్న సీతారాం తండా కు వెళ్దాం..
అక్కడి రైతు చేతికే చెప్పు ఇద్దాం..
వాళ్ల భూములకు నీళ్లు అందలేదంటే నన్ను కొడతారు..
నీళ్లు అందినాయంటే నిన్ను కొడతారు..
ఇంటి దొంగలను దొరకబట్టి.. ఇక్కడనే పాతి పెట్టాలె..
కండ్ల ముందు నీళ్లు పోతుంటే.. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు..
కాళేశ్వరంపై కాంగ్రెస్ వర్గం మీడియా దుష్ప్రచారం చేస్తుంది..
కూలిందన్న ప్రాజెక్టుపై నేనే స్వయంగా కారులో తిరిగి వచ్చిన.. సాక్షాలన్నీ ప్రజల కళ్ళముందుంచిన..
ఇసుక దందాకోసమే కాళేశ్వరం నీళ్లు ఇస్తలేరు..
ఆ దారిలో 9 కిలోమీటర్లకు పైగా ఇసుక లారీలు ఆగి ఉన్నాయి..
ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు నిర్మించిన ఘనత కేసీఆర్ ది మాత్రమే..
సూర్యాపేట జిల్లాకు లక్షలాది ఎకరాల్లో కాలేశ్వరం నీళ్లందించినం..
కాలేశ్వరం కూలేశ్వరం అయిందని కాంగ్రెస్ బిజెపిలో విష ప్రచారం చేశాయి..
కన్నెపల్లి నుంచి 380 కిలోమీటర్ల మేర ప్రవహించి సూర్యాపేటకు నీళ్లు వస్తున్నాయి..
ఇసుక దందా కోసమే కాలేశ్వరం నీళ్లు ఎత్తిపోయడం లేదు..
దీంతో రేవంత్ కు స్వామి కార్యం, స్వకార్యం రెండూ నెరవేరుతున్నాయి..
పోయిన యాసంగిలో పొలాలు ఎందుకు ఎండినయో సమాధానం చెప్పాలి..
నీళ్లు పారె కాలువల్లో నేడు తుమ్మలు, సర్కారు చెట్లు మోలుస్తున్నాయ్..
చంద్రబాబు లాంటి నీటిదొంగలతో చర్చలెందుకు..
చంద్రబాబు పంపిన వాళ్ళను సలహాదారులు గా పెట్టి మరింత దిగజారినవ్..
మేడిగడ్డలో ఒకటి, రెండు పిల్లర్లు మాత్రమే కుంగిపోయినయ్..
మోటార్లు పాడైతే రిపేర్ చేయించుకోమా..
కుంగిన పిల్లర్ ను రిపేర్ చేయకుండా.. కుంటిసాకుతో రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నారు..
చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా గోదావరిలో 38 లక్షల క్యూసెక్కుల వరద నీరు..
కాలేశ్వరం అంటే 3 బ్యారేజీలు.. 15 రిజర్వాయర్లు
19 సబ్ స్టేషన్లు.. 21 పంపు హౌజ్ లు..
203 కిలోమీటర్ల మీద సొరంగాలు.. 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్
98 కిలోమీటర్ల మేర ప్రెజర్ మెయిన్స్.. 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..
530 మీటర్ల ఎత్తుకు లిఫ్టు.. 240 టీఎంసీల నీటి వినియోగం
ఇది కాలేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపం..
ఇప్పుడు నీళ్లు ఇస్తే కాళేశ్వరం పైన చేసిన ఆరోపణలు తప్పని తేలుతుందని భయం..
కెసిఆర్ కు మంచి పేరు వస్తుందని మరో భయం పట్టుకుంది..
ప్రపంచంలోనే కాళేశ్వరం ఓ అద్భుతమైన ప్రాజెక్టు అని.. ఆనాడు కేంద్ర మంత్రులు, మేధావులు ప్రశంసించారు..
కెసిఆర్ గొప్పతనాన్ని దేశ నలుమూలలా చాటిచెప్పారు..
ముందు చూపుతో ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ అద్భుతం అని కితాభించారు..
ఇప్పుడు నువ్వు ఏదో కుంటి సాకులు చెబితే రైతులు నమ్మరు..
ఇకనైనా చంద్రబాబుకు గులాంగిరి మాని.. తెలంగాణ రైతాంగంపై దృష్టి పెడితే మంచిది…
సూర్యాపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో … నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, బిఆర్ఎస్ నాయకులు వందలాది మంది రైతులు పాల్గొన్నారు.