తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్ అనారోగ్యంతో చనిపోయారు. హాస్పిటల్లో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి తుది శ్వాస విడిచారు… తెలుగు సినీపరిశ్రమలో ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి నవ్వులు పూయించిన ఫిష్ వెంకట్ జీవితంలో మాత్రం చాలా విషాదాలు ఉన్నాయి. ఆయన 100 సినిమాలకుపైగా చేసినా కానీ ఆర్ధికంగా నిలబడలేకపోయాడు. ముషీరాబాద్ ప్రాంతంలో చేపల వ్యాపారం చేయడం వల్ల అతనికి ఫిష్ వెంకట్ అనే పేరు వచ్చింది.
అయితే దివంగత నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన ఫిష్ వెంకట్.. కొన్ని సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా, కొన్ని సినిమాల్లో ఫుల్ లెన్త్ రోస్ కూడా చేశాడు. కొన్ని సినిమాల్లో మాత్రం ఆయన పాత్ర పరిధి చాలా తక్కువ అవ్వడంతో భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వచ్చేది కాదు. దానికితోడు వెంకట్ అలవాట్లు కూడా అతని ఆరోగ్యాన్ని పాడుచేసినట్టు తెలుస్తోంది..
గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాలేదు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు కూడా వచ్చాయి. తన కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో అతనికి చాలా మంది హీరోలు సహాయం చేయాదానికి ముందుకు వచ్చారు.
కిడ్నీ మార్పిడికి 50 లక్షలు అవుతుంది అని చెప్పినప్పటికీ ఇండస్ట్రీ లో ఉన్న హీరోలు అవి ఇవ్వడానికి సిద్ధమయ్యారు కానీ కిడ్నీ దత్త దొరక్కపోవడంతో ఆయన తిరిగిరాని లోకాలకు అయితే వెళ్లిపోయాడు.ఇక ఫిష్ వెంకట్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపాన్ని తెలియజేస్తున్నారు…
ఇక పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కూడా చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఏర్పాటు చేసుకున్నాడు. గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ తో అతనికి మంచి అనుబంధమైతే ఏర్పడిందట. మరి మొత్తానికైతే ఆయనకు ఆర్థిక సహాయం చేయడానికి చాలామంది హీరోలతో పాటు ప్రభుత్వం కూడా సహకరించినప్పటికి ఆయన ప్రణాళనైతే కాపాడలేకపోయారు….