ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి షేర్ మార్కెట్లో ఒకే రోజులో రూ.79 కోట్ల భారీ లాభాన్ని ఆర్జించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్ల ధరలు ఊహించని విధంగా పెరగడంతో ఆమెకు ఈ లాభం వచ్చింది. ఈ హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీని చంద్రబాబు నాయుడు స్థాపించారు. ఇంతకీ ఈ కథ ఏంటి? ఎలా సాధ్యమైంది? పూర్తి వివరాలు చూద్దాం. శుక్రవారం రోజు షేర్ మార్కెట్ పెద్దగా లాభాల్లో లేదు, మార్కెట్ మొత్తం పడిపోయే సూచనలు కనిపించాయి. కానీ, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. దాని షేర్ ధర 7 శాతం కంటే ఎక్కువ పెరిగి రూ.493.25 కు చేరుకుంది. ఈ ఒక్క రోజు పెరుగుదలతోనే నారా భువనేశ్వరి గారికి రూ.78,80,11,646ల లాభం వచ్చింది..అసలు ఈ లాభం వెనుక కారణం ఏంటంటే, కంపెనీ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాలు చాలా అద్భుతంగా ఉండటంతో ఇన్వెస్టర్లలో కంపెనీపై నమ్మకం పెరిగింది. అందుకే షేర్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని అంటాయి. నారా భువనేశ్వరి ఈ కంపెనీలో అత్యధిక వాటా ఉన్న వ్యక్తి. ఆమె దగ్గర హెరిటేజ్ ఫుడ్స్ కు చెందిన 2,26,11,525 షేర్లు ఉన్నాయి. ఇది కంపెనీలో ఆమెకు 24.37 శాతం వాటాను ఇస్తుంది. ఈ పెద్ద వాటా ఉండటం వల్లే ఒకే రోజులో ఆమె సంపద ఇంత భారీగా పెరిగింది.
nara-bhuvaneswari