అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై.. పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన.

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై లోక్‌సభలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయగా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు..ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై (Air India incident) లోక్‎సభలో ప్రతిపక్షాలు ప్రశ్నించిన నేపథ్యంలో.. కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ప్రమాదంపై ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్విస్టిగేషన్‌ బ్యూరో పారదర్శకంగా దర్యాప్తు జరుపుతోంది. కానీ, ఈ ఘటనపై విదేశీ మీడియా అసత్య ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సొంత అభిప్రాయాలు చెప్పకూడదు. విమాన ప్రమాదాలకు సంబంధించిన కేసుల్లో నిబంధనల ప్రకారమే దర్యాప్తు చేపడుతారు. అంతర్జాతీయ ప్రోటోకాల్‌కు అనుగుణంగానే దర్యాప్తు కొనసాగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని రామ్మోహన్ నాయుడు అన్నారు.

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంపై దర్యాప్తు అంతర్జాతీయ ప్రోటోకాల్‌లకు అనుగుణంగా జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ దర్యాప్తును ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (AAIB) నిర్వహిస్తోందన్నారు. ప్రమాదం ఎలా, ఎందుకు జరిగిందనే దానిపై సమగ్ర దర్యాప్తు కొనసాగుతోందని, తుది నివేదికలో పూర్తి వివరాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు..