తుఫాన్ హెచ్చరిక.
బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం
రెండు రోజులు కోస్తాంధ్రలో భారీ వర్షాలు
ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాదహెచ్చరిక
తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు
అల్లకల్లోలంగా సముద్రతీరం
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక..
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ కూడా వర్షం దంచికొట్టింది. ఉదయం నుంచి మబ్బులతో చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి చిరు జల్లులు కాస్త భారీవానగా మారింది. సుమారు 2 గంటల పాటు ఏకదాటిగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు.
పడితే వాన, లేదంటే చిరుజల్లులు : వర్షం ధాటికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, మాదాపూర్, అమీర్‌పేట, గచ్చిబౌలి, దిల్సుఖ్నగర్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. వర్షం తగ్గినా నగరమంతటా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి……
రద్దీలో నరకం చూశారు : ఐటీ కంపెనీలు అధికంగా ఉండే మాదాపూర్ టీహబ్, నాలెడ్జ్ సిటీ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై వాహనాలు నిలిచిపోయాయి. ఫ్లైఓవర్‌పై ఒక వాహనం బ్రేక్‌డౌన్ కావడంతో భారీగా ట్రాఫిక్‌జామ్ ఏర్పడింది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా మియాపూర్‌లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మియాపూర్ ఆల్విన్ కాలనీ నుంచి బొల్లారం చౌరస్తా వరకు వాహనాలు నిలిచిపోయాయి. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి ఏర్పడి వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టింది.
గంటల కొద్దీ రోడ్లపైనే : ఓవైపు వాన, మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులతో నగరవాసులు నరకం చూశారు. ఈ ప్రాంతంలో కిలోమీటర్ ప్రయాణానికి గంట సమయం పట్టిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. నగరంలో రాత్రి 7.30 వరకు తేలికపాటు వర్షం కురుస్తూనే ఉంటుందని వాతావరణ శాఖ అంచనావేసింది. హెడ్రా, జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు ప్రతీ కూడలి వద్ద నీరు నిలవకుండా నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. వర్షం ఆగకుండా కురుస్తుండటంతో వారి ప్రయత్నాలు కూడా ఫలించ లేదు..
ఆదిలాబాద్.. కోమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక (Orange Alert) జారీ చేసింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు (భారీ వర్షాల సూచన) ఈ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున
ఎల్లో అలర్ట్ (Yellow Alert) ప్రకటించబడింది: నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి సిద్దిపేట హనుమకొండ…వరంగల్ జనగామ మహబూబాబాద్ ఖమ్మం వికారాబాద్ మహబూబ్‌నగర్ హైదరాబాద్‌లో వర్షం ప్రారంభం హైదరాబాద్ నగరంలో బుధవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కురుస్తున్న ముఖ్య ప్రాంతాలు: జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ పంజాగుట్ట ఖైరతాబాద్..రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు, వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి..