జీతం రూ.15 వేలే.. అక్రమ ఆస్తులు రూ.30 కోట్లు
బెంగళూరు కొప్పల్లోని కలకప్ప అనే వ్యక్తి ఇంట్లో లోకాయుక్త అధికారులు సోదాలు చేశారు. అతను కర్ణాటక రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్లో నెలకు రూ.15 వేలకు క్లర్క్ గా చేస్తున్నాడు. అతనికి 24 ఇళ్లు, 4 స్థలాలు, 40 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. 350 గ్రా.ల బంగారం, 1.5 కిలోల వెండి, 4 వాహనాలు సీజ్ చేశారు. క్లర్క్, అతని భార్య, బామ్మర్దుల పేరిట దాదాపు రూ.30 కోట్ల వరకు ఆస్తులు గుర్తించారు.