రష్యాలో బద్దలైన అగ్ని పర్వతం .. 600 ఏళ్లలో మొదటిసారి..!

*మాస్కో : రష్యాలోని కమ్చట్కాలోని క్రాషెనిన్నికోవ్‌ అగ్ని పర్వతం శనివారం రాత్రి బద్ధలైంది. 600 ఏళ్లలో మొదటిసారి అగ్ని పర్వతం విస్ఫోటనం చెందినట్లు కమ్చట్కా అగ్నిపర్వత విస్ఫోటన ప్రతిస్పందన బృందం అద్యక్షులు ఓల్గా గిరినా పేర్కొన్నారు. గత బుధవారం సంభవించిన భూకంపం ఈ విస్ఫోటనానికి కారణమై ఉండవచ్చని అన్నారు. దీంతో ఫ్రెంచ్‌పాలినేషియా, చిలీ వరకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయని, ఆ తర్వాత కమ్చట్కాలో అత్యంత చురుకైన క్రాషెనిన్నికోవ్‌ అగ్ని పర్వతం బద్దలైందని అన్నారు. అగ్నిపర్వతం విస్ఫోటనం తర్వాత 6,000 మీటర్లు (3.7మైళ్లు) ఎత్తుకు బూడిద పొగమంచులా ఎగిసిపడుతున్నట్లు రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ తెలిపింది.బూడిత తూర్పు దిశగా పసిఫిక్‌ మహాసముద్రం వైపుగా వెళ్లిందని, ఈ ప్రాంతంలో జనసాంద్రత ఉన్న ప్రాంతాలు లేవని అన్నారు. ఈ అగ్ని పర్వతం 1,856మీటర్ల ఎత్తులో ఉంది. 1463లో (40 ఏళ్లు అటు ఇటుగా ) ఈ అగ్ని పర్వతం బద్దలైందని అన్నారు…
ఇదిలా ఉండగా, కమ్చట్కా ద్వీపం సమీపంలో ఉన్న క్రషెనినికోవ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దాదాపు 600 సంవత్సరాల తర్వాత అగ్నిపర్వతం బద్దలవడం ఇదే తొలిసారి. గత వారం వచ్చిన భారీ భూకంప కారణంగానే ఇది విస్ఫోటనం చెంది ఉండొచ్చుని రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ నోవోస్టి, శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ‘క్రషెనినికోవ్ అగ్నిపర్వతం చరిత్రలో ధ్రువీకరించిన మొదటి విస్ఫోటనం’ అని కమ్చట్కా అగ్నిపర్వత విస్ఫోటనాల అధ్యయన బృందం చీఫ్ ఒల్గా గిరినా తెలిపారు..