84 శాతం మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నాం: మంత్రి ఉత్తమ్.

TG: రాష్ట్ర జనాభాలో 84 శాతం మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 89 లక్షల రేషన్కార్డులు ఉండగా.. తమ ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్య 98.59 లక్షలకు చేరిందని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 8.64లక్షల కొత్త కార్డులు జారీ చేసిందన్నారు. గతంలో 2.81కోట్ల మందికి నాసిరకమైన దొడ్డు బియ్యం పంపిణీ చేశారని.. ఇప్పుడు 3.17కోట్ల మందికి నాణ్యమైన సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు