చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు?: సుప్రీం …
భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. “2 వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు?” అని ప్రశ్నించింది. నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని అభిప్రాయపడింది. రాహుల్ తరఫున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ స్పందిస్తూ, “ఇలాంటి విషయాలు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రస్తావించకపోతే ఎలా?” అని వాదించగా.. ఇలాంటి విమర్శలు పార్లమెంటులో చేయాలంటూ ధర్మాసనం హితవు పలికింది….
SC Slams Rahul Gandhi: దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా 2 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించింది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం స్పందిస్తూ.. నిజమైన భారతీయుడు ఇలా మాట్లాడడు అని ఘాటుగా వ్యాఖ్యానించింది. సుప్రీం కోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. రాహుల్ గాంధీపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పరువు నష్టం వేస్తూ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది..2022 భారత్ జోడో యాత్ర సందర్భంగా.. భారత్-చైనా సరిహద్దు వివాదంపై రాహుల్ గాంధీ స్పందించారు. చైనా సైన్యం మన దేశ భూభాగంలోని 2,000 చదరపు కిలో మీటర్ల భూమిని ఆక్రమించిందని పలుమార్లు ఆరోపించారు. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్లో భారత సైనికులను తొక్కేస్తున్నాయని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు నమోదు చేసింది. ముఖ్యంగా అలహాబాద్ హైకోర్టుకు వెళ్లగా.. మే 29న రాహుల్ గాంధీకి జరిమానా విధించింది….దీంతో రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు రాజకీయకంగా ప్రేరేపించబడిందని, కావాలనే తనపై కోపంపై పలువురు ఈ కేసు పెట్టారని వాదించారు. అయితే తాజాగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు షాకింగ్ కామెంట్లు చేసింది. ముఖ్యంగా చైనీయులు 2 వేల చదరపు కిలో మీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నారని మీకు ఎలా తెలుసంటూ వ్యాఖ్యానించింది. అలాగే మీరు నిజమైన భారతీయులు అయితే ఇలా మాట్లాడి ఉండరంటూ చెప్పింది..రాజకీయ నాయకులు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతకు సంబంధించిన విషయాలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతాయుతంగా ఉండాలని ఈ సంఘటన సూచిస్తోంది. దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, ప్రజలను గందరగోళానికి గురిచేసేలా వ్యాఖ్యలు చేయకూడదని న్యాయస్థానం పరోక్షంగా హెచ్చరించినట్లు భావించవచ్చు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలను అప్పట్లో బీజేపీ తీవ్రంగా ఖండించింది. విపక్ష నాయకులు దేశ భద్రతపై అనవసరంగా సందేహాలను సృష్టించి, సైన్యం మనోబలాన్ని దెబ్బతీస్తున్నారని బీజేపీ..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959.