ఈవీఎంలపై దేశ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయని, వాటి పట్ల ప్రజలు విశ్వసనీయతను కోల్పోయారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘంతో సమావేశం అనంతరం కేటీఆర్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు..ఇవాళ ఈసీ ముందు ఆరేడు విషయాలు కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పాం. అందులో ఒకటి ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు అమెరికా లాంటి దేశాలు కానీ, యూకే, జర్మనీ, ఇటలీ కానీ, ఇంకా చాలా దేశాలు కొంతకాలం వరకు ఈవీఎంలను ప్రయోగాత్మకంగా అమలు చేసినప్పటికీ, ప్రజల్లో వాటిపై విశ్వాసం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఈవీఎంలను రద్దు చేసి పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో దాదాపు 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇలాంటి దేశంలో ఈవీఎంల వల్ల నష్టం జరుగుతున్నది. మేం వేసిన వారికి ఓటు పడడం లేదని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ క్రమంలో ఈవీఎంలను పక్కనపెట్టి, పేపర్ బ్యాలెట్లను తేవాలని మా పార్టీ తరపున ఎన్నికల కమిషన్ను కోరాం. పేపర్ బ్యాలెట్ విధానాన్ని నవంబర్లో జరిగే బీహార్ ఎన్నికల్లో అమలు చేయాలని కోరాం. ఆ తర్వాత వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానం అమలు చేయాలని మా పార్టీ తరపున కుండబద్దలు కొట్టినట్టు మా పార్టీ అభిప్రాయం చెప్పామని కేటీఆర్ తెలిపారు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959