వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపిండు
స్లాబ్ వేసుకోవాలి వర్షం ఆపండి సార్ అంటే వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపేశాడు – అందెశ్రీ.
https://www.facebook.com/share/v/177jat1nVg/.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై ప్రముఖ కవి అందెశ్రీ(Ande Sri) వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందెశ్రీ రచించిన హసిత భాష్పాలు పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అందెశ్రీ మాట్లాడుతూ..
కేసీఆర్ను గద్దె దించిన రోజే రేవంత్ రెడ్డి ప్రపంచ విజేతల్లో ఒక్కడిగా లిఖించబడ్డాడని అన్నారు..
నా పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి ఒక్కడు వస్తే చాలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు వచ్చినట్లే అని భావించాను అని తెలిపారు. శ్రీకృష్ణ తులాభారంలో తులసి పత్రం లాంటి వాడు రేవంత్ రెడ్డి అని అందెశ్రీ కొనియాడారు. స్లాబ్ వేసుకోవాలి వర్షం ఆపండి సార్ అంటే వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపేశాడని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ సమాజం కవులకు, పోరాటానికి స్ఫూర్తినిచ్చిన గడ్డ అని కొనియాడారు. ఉద్యమంలో గూడ అంజన్న, దశరథి, కాళోజీ, అందెశ్రీ, గద్దర్, గోరెటి వెంకన్న వంటి అనేక కవులు ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు..
కానీ ప్రస్తుతం వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపిండు
స్లాబ్ వేసుకోవాలి వర్షం ఆపండి సార్ అంటే వర్షం పడకుండా రేవంత్ రెడ్డి ఆపేశాడు – అందెశ్రీ.
ఈ మాటలు చాలామంది కి హాస్యం తెప్పించే అంశం గా మారింది..