TDP MLA Daggupati Venkateswara Rao Reaction On Audio Call.
జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. ఆయన జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.
https://www.instagram.com/reel/DNcklHQpykN/?igsh=YTMwNjBveWw5ajZp
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అనంతపురం శ్రీనగర్ కాలనీలోని టీడీపీ ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. దగ్గుబాటి ప్రసాద్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని అక్కడే బైఠాయించి, నినాదాలు చేశారు. ఆఫీసు ముందు, నగరంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఫ్లెక్సీలను చింపేశారు…ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్ జోలికి వస్తే సహించేది లేదని తెలిపారు. నందమూరి ఫ్యాన్స్ లేనిదే టీడీపీ లేదని తెలిపారు. మేం కన్నెర్ర చేస్తే తెలుగు దేశం పార్టీనే ఉండదని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ మొహం చూసి ఓట్లేస్తే ఎమ్మెల్యేగా గెలిచావని దగ్గుబాటి ప్రసాద్‌పై మండిపడ్డారు. దగ్గుబాటి ప్రసాద్ ఆడియో వైరల్ కావడంతో.. అది ఏఐ వీడియో అని ఆయన ఖండించారు. అది ఫేక్ ఆడియో అయినప్పటికీ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. కానీ ఎమ్మెల్యే క్షమాపణలపైనా నందమూరి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడియో క్లిప్‌లో ఉన్న వాయిస్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్‌దేనని స్పష్టం చేశారు…నాలుగు గోడల మధ్య చెప్పే క్షమాపణలు మాకు అక్కర్లేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బహిరంగంగా వచ్చి అందరి మధ్యలో క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే డైరెక్ట్ ఎటాక్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. మా అన్న ఏ రోజూ రాజకీయాల్లో తలదూర్చలేదు.. ఒక వేళ మా అన్న రాజకీయాల్లోకి వచ్చి ఉంటే మీరు ఎమ్మెల్యేలు అయ్యే వాళ్లా అంటూ మండిపడ్డారు. కాగా, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అందుబాటులో లేరని.. ఆయన వచ్చాక బహిరంగ క్షమాపణలు చెప్పిస్తానని ఎమ్మెల్యే ప్రధాన అనుచరుగు గంగారాం హమీ ఇచ్చారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆందోళన విరమించారు.
జూనియర్ ఎన్టీఆర్‌ను బూతులు తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పై చంద్రబాబు ఆగ్రహం
చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇచ్చేలా ఎమ్మెల్యేల వైఖరి ఉండకూడదు
తప్పుడు ప్రచారంపై వెంటనే ప్రజలకు వాస్తవాలు చెప్పాలి
ఎమ్మెల్యేల తప్పులతో జరిగే నష్టాన్ని పార్టీ ఎందుకు ఎదుర్కోవాలి – చంద్రబాబు నాయుడు..
అసలు ఏమైందంటే..
.
ఎన్టీఆర్ అభిమానుల సంఘం నేత ధనుంజయ నాయుడుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్‌తో మాట్లాడిన ఒక ఫోన్ కాల్ ఆడియో తాజాగా లీకయ్యింది. అందులో వార్ 2 సినిమా షోలను అనంతపురంలో నిలిపివేయాలని హెచ్చరించడంతోపాటు బూతులతో రెచ్చిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఎలా చూస్తారు? నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వను. పర్మిషన్ లేకుండా ప్రత్యేక షోలు ఎలా వేస్తారు. వాడి సినిమాకు ఎలా వెళ్తారు.. కూలీకి పోండి.. పార్టీకి కలిసిరాని వ్యక్తి సినిమాకు ఎలా వెళ్తారు. ఆ సినిమా వేస్తే కాల్చేస్తాను.. ఆ సినిమా రీల్ కూడా రాదు. నా అనుమతి లేకుండా సినిమా ఎలా ప్రదర్శిస్తారు. వాడితో డ్యాన్సులు చేస్తారా? మీరు సినిమా చూడండి మీకు అప్పుడు చెబుతాను. సినిమాను ప్రదర్శిస్తే మధ్యలోనే కాల్చేస్తా. వాడి సినిమా ఈ టైమ్‌లో ఎలా వేస్తారు. ఆడించుకోండి చూద్దాం.’ అంటూ ఎమ్మెల్యే మాట్లాడటం అందులో ఉంది. ఇది చూసి ఎన్టీఆర్ అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు..
జూనియర్ ఎన్టీఆర్‌ను లం…. కొడుకు అంటూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టినట్లుగా ఆ ఆడియో కాల్లో ఉంది. ‘మంత్రి లోకేశ్ గురించే తప్పుగా మాట్లాడతాడా? ‘వార్ 2′ ఎలా ఆడుతుందో చూస్తా. అనంతపురంలో సినిమా ప్రదర్శనను నిలిపేయాలి.’ అంటూ వార్నింగ్ ఇచ్చినట్లుగా ఆ ఆడియోలో ఉంది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మూవీ ప్రదర్శనను ఎలా ఆపేస్తారో చూస్తామంటూ కామెంట్స్ చేశారు. ఓ ఎమ్మెల్యే అయ్యుండి అలా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ పేర్కొన్నారు. తాజాగా ఆ ఆడియో కాల్ తనది కాదంటూ ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు. .