Letest news.. నేటి ప్రధాన ముచ్చట్లు..

*ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా పెరుగుతున్న వరద..*

మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు…

70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల..

ప్రస్తుతం 2.84 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రేపటి లోగా 3.97 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం..

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.
వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం
రేపు ఒడిశా-ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం..
తీరం వెంబడి 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు..
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల హెచ్చరిక..

20వ తేదీకి 7లక్షలకు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అధికారులు….

వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్.

తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ కూలీల పిల్లలకు గుడ్‌న్యూస్. వారికి ఇక నుంచి ఆ కోర్సుల్లో 15శాతం రిజర్వేషన్లు అమల్లోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా తొలిసారిగా వ్యవసాయ కూలీల పిల్లల కోసం బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 15శాతం సీట్లను ప్రత్యేక కోటాగా కేటాయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు..
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ, హార్టికల్చర్, వెటర్నరీ యూనివర్సిటీల పరిధిలోని వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకోసం ఈనెల 19 నుంచి 23వ తేదీ వరకు ఫస్ట్ ఫేజ్ జాయింట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని విద్యాసాగర్ తెలిపారు. రాజేంద్రనగర్ లోని అగ్రికల్చర్ వర్సిటీ ఆడిటోరియంలో ఆ తేదీల్లో ఉదయం 9.30గంటలకు కౌన్సెలింగ్ జరగనుందని చెప్పారు.

అర్హతలు ఇవే..
♦ నాల్గో తరగతి నుంచి 12వ తరగతి వరకు కనీసం నాలుగేళ్లు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు లేదా రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు ఈ కోటాకు అర్హులు.
♦ విద్యార్థి లేదా వారి తల్లిదండ్రుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డు ఉండాలి.
♦ విద్యార్థి, వారి తల్లిదండ్రులు లేదా తాతల పేరిట ఎలాంటి వ్యవసాయ భూమి ఉండకూడదు. అయితే, ఒక ఎకరం భూమి ఉన్నవారు పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉంటే ఈ కోటాకు అర్హులు.
♦ కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికెట్లు తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
♦ బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల మొదటి సెమిస్టర్ ఫీజు రూ.49,560గా నిర్ణయించామని రిజిస్ట్రార్ విద్యాసాగర్ తెలిపారు.
♦ పూర్తి వివరాలకోసం విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.pjtsau.edu.in లో చూడొచ్చు..

శ్రీ కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర విషాదం.. ఐదుగురు మృతి

ఉప్పల్ – రామంతపూర్ గోఖలే నగర్‌లో శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ కృష్డుడి విగ్రహం ఊరేగింపు ముగింపులో విషాదం

రథంను తోసుకుంటూ వెళ్తున్న సమయంలో విద్యుత్ తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే 5 మంది మృతి.. మరో నలుగురు పరిస్థితి విషమం

క్షతగాత్రులను వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు.

మృతుల వివరాలు:

1. కృష్ణ యాదవ్ ( 24)
2. శ్రీకాంత్ రెడ్డి (35) తండ్రి ఆంజిరెడ్డి
3. సురేష్ యాదవ్ (34) తండ్రి వెంకటయ్య
4. రుద్ర వికాస్ (39)
5. రాజేంద్ర రెడ్డి (39).

*🔹తెలంగాణాలో యూరియా కొరతపై పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇచ్చిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు.*

వాయిదా తీర్మానం ప్రతిపాదనను లోకసభ సెక్రటరీ జనరల్‌కు పంపిన లోకసభ సభ్యుడు చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు తెలంగాణ రాష్ట్రానికి 9.80లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియాను కేటాయించిన కేంద్రం

ఆగస్టు 13వ తేదీ వరకు 6.60లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా రాష్ట్రానికి సరఫరా చేయాల్సి ఉందని చామల వెల్లడి

కాని ఇప్పటి వరకు కేవలం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా అయినట్లు పేర్కొన్న చామల

రాష్ట్రంలో 2.10లక్షల మెట్రిక్‌ టన్నులు యూరియా కొరత ఏర్పడినట్లు ఎంపీ చామల ఆందోళన

పంటలకు అవసరమైన యూరియా దొరకక రైతుల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు వాయిదా తీర్మానం లో పేర్కొన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి

ఇందువల్ల రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి తీవ్ర గందరగోళ పరిస్థితులకు దారితీసినట్లు వెల్లడి

జూన్‌లో రావాల్సిన నైరుతి రుతుపవణాలు ముందుగానే ఈ ఏడాది మే 26న రాష్ట్రానికి వచ్చాయి

సకాలంలో యూరియా అందకపోవడంతో ఆ ప్రభావం పంటలపై తీవ్రంగా పడుతోందని ఎంపీ ఆందోళన

రాష్ట్రంలో ఉత్పన్నమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని యూరియా కొరత అంశాన్ని లేవనెత్తేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కోరిన చామల..

భారీ వర్షం రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్…!

హైదరాబాద్ మహానగరంలోని భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా.. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. అదివారం సెలవు దినం అయినా.. రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్అవ్వడంతో వాహనాలు మెల్లగా సాగుతున్నాయి. ట్రాపిక్‌ను తొలగించడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు..
రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. బేగంపేట్ ప్రకాష్ నగర్‌లో మోకాళ్ల లోతు నీరు చేరింది. వర్షం పడిన ప్రతీసారి తమకు ఈ బాధలు తప్పడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు కోరుతున్నారు.

పలు ప్రాంతాలు జలమయం..
అంతేకాకుండా.. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాలు జలమయమైనాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి.. సహాయక చర్యలు చేపట్టాయి..

ఒక ఫామ్‌హౌస్‌లో ఆఫ్రికన్ దేశస్తుల బర్త్‌డే పార్టీ.. అనుమతి లేకుండా భారీగా విదేశీ మద్యంతో పార్టీ నిర్వహణ...

రంగారెడ్డి జిల్లా బాకారం ఫామ్‌హౌస్‌కు ఇమ్మిగ్రేషన్ అధికారులు.. మద్యం పార్టీ చేసుకుంటూ పట్టుబడ్డ ఆఫ్రికన్ దేశస్తుల వీసా, పాస్‌పోర్టులు చెకింగ్.. మొత్తం 51 మంది వీసాలను తనిఖీ చేస్తున్న అధికారులు.. వీసా గడువు ముగిసినా పలువురు అక్రమంగా ఉంటున్నట్లు గుర్తింపు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీల తర్వాత డ్రగ్స్ పరీక్షలు..

జమ్మూ కశ్మీర్ లో గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న రెండోరోజు ఆపరేషన్.. ఘటన సమయంలో దాదాపు 1200 మంది ఉండొచ్చని అంచనా.. శిథిలాల కింద ఇంకా 500 మంది ఉండొచ్చని అంచనా.. రెస్క్యూ ఆపరేషన్ లో దాదాపు 300 మంది సైనిక బృందం.. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మంది గుర్తింపు..

విజయవాడ: స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. ఎన్టీఆర్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించారు.. మహిళలకు అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారు.. సినిమాలు, వెబ్ సిరీస్ లలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు ఉంటే తీసివేయ్యాలి: మంత్రి లోకేష్

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి శ్రీకారం.. మహిళల అందరి తరపున చంద్రబాబుకు కృతజ్ఞతలు.. మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం.. ఈ పథకానికి ఏటా రూ. 2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.. ప్రభుత్వ గుర్తింపు కార్డుతో ఏపీ మొత్తం ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు: డిప్యూటీ సీఎం పవన్.

మరీ ఇంత ఘోరమా!

అంబులెన్స్ లేక చనిపోయిన వ్యక్తిని తోపుడు బండిలో తరలించిన పోలీసులు

సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజవర్గంలో ఇదీ దుస్థితి

కొడంగల్ – నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో మొగులయ్య (28) అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై బస్టాండ్ వైపు వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్క డే మృతి

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్ లేకపోవడంతో మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అర కిలోమీటరు దూరంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తోపుడు బండిపై మృతదేహాన్ని తరలించారు

సంతలో నిమ్మకాయలు విక్రయించేందుకు వచ్చిన ఓ చిరువ్యాపారికి చెందిన తోపుడు బండిని అతని అనుమతి లేకుండానే తీసుకొని పోలీసులు మృతదేహాన్ని తరలించడం చూసి అక్కడున్న జనం అవాక్కయ్యారు..

ఏపీలో ఐదు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌
విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ..
పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ
శ్రీకాకుళం, మన్యం,అల్లూరి, తూ.గో., ఏలూరు, కృష్ణా..బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాలకు ఆరెంజ్ అలర్ట్.. వైశాఖ అల్లూరి, అనకాపల్లి జిల్లాలో స్కూళ్లకు సెలవు..ప్రధాన పోర్టుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ…విశాఖ, గంగవరం, కాకినాడ, నిజాంపట్నం, మచిలీపట్నం..కృష్ణపట్నం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ..

*జాతీయ వార్తలు* (National)
📍ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ ను ఎన్‌డిఏ నామినేట్ చేసింది.
📍ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ప్రాంతీయ సమతుల్యత – రాష్ట్రపతి ఉత్తరాది నుంచి, ఉపరాష్ట్రపతి దక్షిణాది నుంచి.
📍ప్రధాని మోడీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ప్రకటనకు స్వాగతం పలుకుతూ హైవే ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో “Vocal for Local” నినాదాన్ని మళ్లీ ప్రస్తావించారు.
📍ఎన్నికల సంఘం – అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉంటాయని, 18 ఏళ్లు నిండిన ప్రతివారికి ఓటు హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
📍సిక్కిం–కాలింపాంగ్‌ను కలిపే NH-10 మళ్లీ ప్రారంభం, భూస्खలనంతో మూసివేత తరువాత.
📍ముంబైలో దేశంలోని తొలి అన్ని మహిళలు నడిపే క్లీన్ స్ట్రీట్ ఫుడ్ హబ్ ను పీయూష్ గోయల్ ప్రారంభించారు.
📍మాజీ అంతరిక్ష యాత్రికుడు శుభాంశు శుక్లా భారత్‌కు తిరిగొచ్చారు – ఢిల్లీలో ఘనస్వాగతం, ప్రధాని మోడీతో భేటీ.
*అంతర్జాతీయ వార్తలు* (International)
📍చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్‌లో పర్యటన, జైశంకర్, NSA దోవల్‌తో సమావేశం. ↳ అనంతరం SCO సమ్మిట్ కోసం మోడీ చైనా పర్యటన.
📍నైజీరియాలో పడవ ప్రమాదం – 40 మంది మిస్సింగ్.
📍జెలెన్స్కీ – అమెరికా భద్రతా హామీని చారిత్రాత్మకంగా పేర్కొన్నారు.
📍అమెరికా – ట్రంప్–పుతిన్ అలాస్కా చర్చల తరువాత భారత్‌పై టారిఫ్ హెచ్చరిక. ↳ దాని ప్రభావంతో భారత్‌లో 3 లక్షల ఉద్యోగాలకు ముప్పు (టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, రొయ్యలు, ఆభరణాలు రంగాల్లో ఎక్కువ ప్రభావం).
📍రష్యా – స్మొలెన్స్క్ అణు కేంద్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి అడ్డుకున్నామని ప్రకటన.
📍పాకిస్తాన్ నార్త్‌వెస్ట్‌లో పిక్నిక్‌లో కాల్పులు – 7 మంది మృతి.
📍సెర్బియా అధ్యక్షుడు – నిరసనకారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక.
📍బొలీవియాలో జాతీయ ఎన్నికలకు పోలింగ్.
📍ఇజ్రాయెల్‌లో నిరసనలు – గాజా కాల్పుల విరమణ, బందీల విడుదల డిమాండ్.
📍సిరియా అధ్యక్షుడు – దేశ ఏకీకరణ రక్తపాతం లేకుండా జరగాలి అన్నారు.
📍హమాస్ – ఇజ్రాయెల్ పునరావాస ప్రణాళికను తిరస్కరించింది.
📍ఇజ్రాయెల్ – గాజా దక్షిణానికి ప్రజల తరలింపుకు సన్నాహాలు.
📍లావ్రోవ్ – అలాస్కా సమ్మిట్ ఫలితాలపై టర్కీ, హంగేరీ నేతలతో చర్చలు.
*ఇతర అంతర్జాతీయ పరిణామాలు*
📍ఎయిర్ కెనడా – కేబిన్ క్రూ యూనియన్ నిరసనతో రీస్టార్ట్ ప్రణాళికలు వాయిదా.
📍స్పెయిన్ – వేడిగాలుల కారణంగా అగ్నిమాపన కోసం 500 అదనపు సైనికులు మోహరింపు.
📍చైనా – రష్యా చమురు రిఫైన్ చేసి యూరప్‌కు విక్రయం. ↳ యూరప్ కఠిన ఆంక్షలు పరిగణనలో.
📍న్యూయార్క్ క్లబ్‌లో కాల్పులు – 3 మంది మృతి.
📍చైనా $11 ట్రిలియన్ స్టాక్ మార్కెట్ – షీ & ట్రంప్‌కు సవాలు.
📍అల్‌జీరియా తెబెస్సా ప్రావిన్స్‌లో 5.8 భూకంపం.
📍ఇరాక్ – ఐసిస్ మాస్ గ్రేవ్ తవ్వకం ప్రారంభం.
📍దుబాయ్ – కొత్త వర్చువల్ వీసా రూ. 8,900లో ఏడాదికి ఆఫర్.
📍ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ – యుద్ధ ప్రభావంతో అనూహ్య క్షీణత.
📍ICC – ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ బాబ్ సింప్సన్ మృతికి సంతాపం.
*ఆంధ్రప్రదేశ్‌*
📍ఏపీ ప్రభుత్వం – బనకచర్లతో పాటు మరో నాలుగు లింక్ ప్రాజెక్టులు ప్రణాళికలో. ↳ వాటిలో మూడు పోలవరం ఆధారితమే.
📍ఏపీలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్, 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్. ↳ విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు.
📍తిరుపతిలో భారీ వర్షాలు – భక్తుల రద్దీతో ఇబ్బందులు.
📍చంద్రబాబు ప్రభుత్వం – భూములను 99 పైసలకు ఇచ్చే నిర్ణయం.
📍విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కీలక పరిణామం – వివిధ విభాగాల నిర్వహణకు టెండర్లు ఆహ్వానం.
📍ఢిల్లీలో నారా లోకేష్ కేంద్ర మంత్రులతో సమావేశం, ఏపీ ప్రతిపాదనలు సమర్పణ.
*తెలంగాణ*
📍తెలంగాణలో భారీ వర్షాలు – భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్.
📍వరంగల్ ఒరుగల్లు కోట వరద ముప్పులో – నీరు నిల్వ కారణంగా కట్టడాలు దెబ్బతిన్నాయి.
📍సర్వాయి పాపన్న విగ్రహ శంకుస్థాపన ట్యాంక్‌బండ్‌పై సీఎం రేవంత్ చేతుల మీదుగా. ↳ రవీంద్రభారతిలో జయంతి వేడుకలు.
📍హైదరాబాద్ పట్టణాల్లో పలపిట్ట పక్షుల సంఖ్య తగ్గిందని ది హిందూ సర్వే నివేదిక.
📍హైదరాబాద్‌లో కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం – రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 5 మంది మృతి, 4 మంది గాయాలు.
..ఫేక్ సర్టిఫికెట్లతో లెక్చరర్ జాబ్స్ – 12 జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయి నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి.
.రేషన్‌తో పాటు సెప్టెంబర్ నుండి ఉచిత బ్యాగుల పంపిణీ.
📍నేడు ఫిల్మ్ ఫెడరేషన్-ఫిల్మ్ ఛాంబర్ సమావేశం, సినీ కార్మికుల వేతనాలపై చర్చ. ↳ సాయంత్రం చిరంజీవి నివాసంలో మరో సమావేశం.
వాతావరణం (Weather)
📍పశ్చిమ, దక్షిణ భారత రాష్ట్రాల్లో (కొంకణ్, గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, తీర కర్ణాటక) భారీ నుండి అతిభారీ వర్షాలు.
📍ఆగస్టు 19 వరకు దక్షిణ భారతంపై బలమైన గాలులు.
📍హిమాచల్, జమ్ము–కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, కొంకణ్ & గోవా, తీర కర్ణాటకలో ఫ్లాష్ ఫ్లడ్ ప్రమాదం.
📍ఉత్తరాఖండ్, హిమాచల్, జమ్ము–కాశ్మీర్‌లో క్లౌడ్ బర్స్ట్ ప్రమాదం ఎక్కువ.
📍ఢిల్లీలో ఉక్కపోత వాతావరణం.
📍బీహార్‌లో వర్షం, మెరుపు హెచ్చరిక.
📍గుజరాత్, మహారాష్ట్ర, ఈస్ట్ & వెస్ట్ రాజస్థాన్‌లో భారీ వర్షాలు.
📍బంగాళాఖాతంలో అల్పపీడనం, రేపు ఒడిశా–ఉత్తరాంధ్ర తీరం దాటే అవకాశం.
*రాజకీయాలు* (Politics)
📍ప్రధాని మోడీ – ప్రతిపక్షం రాజ్యాంగాన్ని ఎంచుకొని ఉటంకిస్తోందని విమర్శ.
📍ఎన్నికల సంఘం – ఓటు దొంగతనం వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ అఫిడవిట్ కోరింది.
📍రాహుల్ గాంధీకి ఈసీ 7 రోజుల గడువు – ఆధారాలు ఇవ్వండి లేదా క్షమాపణ చెప్పండి.
📍బిహార్‌లో రాహుల్ గాంధీ ‘ఓటర్ అధికార్ యాత్ర’ కొనసాగుతోంది.
📍ఢిల్లీలో ఇండి కూటమి నేతల సమావేశం, ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చ.
📍బీజేపీ పార్లమెంటరీ బోర్డు కీలక సమావేశం – హరివంశ్ నారాయణ్ సింగ్ పేరు పరిశీలనలోకి.
📍కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ – వరంగల్ జిల్లా నేతలపై చర్చ. ↳ నర్సారెడ్డి దాడి ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు.
📍మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి – తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి శివుడి విగ్రహ ప్రారంభోత్సవం.
📍ముగ్గురు ఎమ్మెల్యేల తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి, నివేదిక కోరారు.
📍రేపు ఢిల్లీలో చంద్రబాబు ఉపరాష్ట్రపతి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
📍నేడు కేంద్రమంత్రి బండి సంజయ్ దేవరకొండ పర్యటన – అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
*సామాజికం* (Social)
📍ఢిల్లీలో నిరసనకారులు – అల్లంతా తిరిగే కుక్కల శస్త్రచికిత్స పెంచాలని డిమాండ్.
📍ఢిల్లీలో ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగి మొబైల్ ఫోన్ల దొంగతనం కేసులో అరెస్ట్.
📍జాతీయ అనుభవ్ అవార్డులు 2025 ఈ రోజు ప్రదానం కానున్నాయి.
📍సిమ్లాలో వీధి కుక్కలకు QR కోడ్, GPS ట్యాగులు అమర్చనున్నారు.
📍దేశంలో కొత్త లా కళాశాలల ఏర్పాటు పై మూడు సంవత్సరాల నిషేధం.
*వ్యాపార & ఆర్థికం* (Business & Economy)
📍S&P Global భారత క్రెడిట్ రేటింగ్ అప్‌గ్రేడ్ – మార్కెట్లు పాజిటివ్ ఓపెనింగ్ ఆశాజనకం.
📍GIFT Nifty 265 పాయింట్లు ఎగబాకింది.
📍వొడాఫోన్ ఐడియా, గ్లెన్‌మార్క్ తదితర Q1 ఫలితాలు ఈ రోజు.
📍KEC International, PNC Infratech – కొత్త ప్రాజెక్టులు సాధించారు.
📍EaseMyTrip, Dixon Technologies – భాగస్వామ్యాలు & కొనుగోలు ఒప్పందాలు.
📍వేదాంతకు SEBI వార్నింగ్, Somany Ceramics – గ్యాస్ సరఫరా సమస్యతో ఉత్పత్తి నిలిపివేత.
📍టోరెంట్ పవర్ – గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ప్రారంభం.
📍HOEC – ఉత్పత్తి పునఃప్రారంభం.
📍PVR Inox, Lemon Tree Hotels, Electronics Mart India – విస్తరణ ప్రణాళికలు.
📍Sun Life Excel India Fund, ICICI Bank – బల్క్ డీల్స్.
📍Indostar Capital Finance, Edelweiss Financial – కొత్త నాయకత్వ మార్పులు.
📍ముడి చమురు ధరలు తగ్గినా, బంగారం ధరలు రికార్డు గరిష్టం దగ్గర.
🚨 *నేరం* (Crime)
📍సంగారెడ్డిలో 128 కిలోల గంజాయి పట్టివేత, ఒడిశా నుంచి మహారాష్ట్ర తరలింపు.
📍హైదరాబాద్ రామంతాపూర్‌లో కృష్ణాష్టమి ఊరేగింపులో రథానికి విద్యుత్ తీగలు తగలడంతో 5 మంది మృతి కేసుపై దర్యాప్తు.
*క్రీడలు* (Sports)
📍పాకిస్తాన్ – ఆసియా కప్ & UAE సిరీస్ కోసం బాబర్ ఆజమ్, రిజ్వాన్‌ను జట్టులోంచి తొలగించింది.
📍కార్లోస్ అల్కారజ్ – అలెగ్జాండర్ జ్వెరెవ్పై గెలిచి సింసినాటి ఫైనల్‌కు చేరాడు.
📍భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి యశస్విని ఘోర్పడే – యూరప్ స్మాష్ మైన్ డ్రాలో అర్హత.
📍అనహత్ సింగ్ – NSW స్క్వాష్ బేగా ఓపెన్ ఫైనల్లో పరాజయం.
📍నీరజ్ చోప్రా – డైమండ్ లీగ్ 2025 ఫైనల్‌కు అర్హత.
📍గౌతమ్ గంభీర్ – టీ20 జట్టులో పెద్ద మార్పులు, ఆల్-ఫార్మాట్ కెప్టెన్ కోసం అన్వేషణ.
📍ఆసియా కప్ కోసం షుభ్మన్ గిల్ కంటే అనుభవజ్ఞులపై భారత్ దృష్టి.
*సినిమా (Cinema)*
📍“కూలీ” vs “వార్ 2” బాక్సాఫీస్ పోటీ – రజనీ సినిమా రికార్డుల వేట కొనసాగుతోంది.
📍సినీ కార్మికులు – “మా సంపాదనలో సగం వైద్య ఖర్చులకు వెళ్తోంది” అంటూ నిర్మాతలపై విమర్శలు.
📍చిన్న నిర్మాతల బృందం చిరంజీవిని కలిసి సమస్యలపై చర్చించింది.
🛕 *ఇతర ముఖ్యాంశాలు* (Other Updates)
📍తిరుమలలో భక్తుల రద్దీ – టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం. ↳ నిన్న 86,364 మంది భక్తులు దర్శనం.