*సూర్యాపేట జిల్లా* ….
కొన్ని ఘటనలు గతంలో సినిమాలో చూసి ఉంటాం… అలాంటి ఘటన ఒకటి సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది..
పాలకీడు మండలం మీగడం పాడు తండాలో అరుదుగా జరిగే ఘటన, మూగజీవుల ప్రేమ,,..
అనారోగ్యంతో రూపావత్ చిన్న నాయక్ చనిపోవడంతో, మృతదేహం వద్దే దీనంగా చూస్తూ కూర్చున్న అంబోతు……..
మృతదేహం వచ్చిన తర్వాత మృతదేహం వైపు చూస్తూ,, అక్కడే కూర్చోవడంతో ఆ భగవంతుడే పంపించి ఉంటాడు అంటూ ప్రచారం జరుగుతోంది….
ఒక వ్యక్తి చనిపోతే బంధువులు, గ్రామస్తులు, మిత్రులు ఇలా తెలిసినవారు ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనను చివరి చూపు చూసేందుకు రావడం సహజం. కానీ ఓ వ్యక్తి చనిపోతే ఓ ఆంబోతు వచ్చి మృతదేహం పక్కనే కూర్చుని, మృతున్ని దీనంగా చూస్తూ బంధువులతో పాటు ఉన్న సంఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని మీగడం పహాడ్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మీగడం పహాడ్ తండాకు చెందిన రూపావత్ చిన్న నాయక్ (54)అనారోగ్యంతో నార్కెట్ పల్లిలోని కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. అదే రాత్రి ఆయన కుటుంబ సభ్యులు ఆయన మృతదేహాన్ని మీగడం పహాడ్ తండాకు తీసుకువచ్చారు. అయితే మఠంపల్లి మండలం మంచ్య తండాకు చెందిన ఓ ఆంబోతు ఆదివారం తెల్లవారుజామున గ్రామస్తులందరికంటే ముందే ఇంటి వరండాలో పెట్టిన మృతదేహం వద్దకు చేరుకుంది. ….ఎవరైనా మరణిస్తే చివరిచూపు చూసేందుకు బంధుమిత్రులు, గ్రామస్తులు, తెలిసినవాళ్లు వచ్చి కుటుంబ సభ్యులను పలకరించి ఓదార్చి వెళ్లడం సహజం. కానీ ఆ ఊళ్లో ఓ వ్యక్తి మృతి చెందగా తెల్లారేసరికి అతడితో ఏ సంబంధమూ లేని ఓ ఆంబోతు వచ్చి మృతదేహం పక్కనే దీనం గా చూస్తూ పడుకున్నది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకవీడు మం డలంలోని మీగడం పహాడ్ తండాలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. వివరాల్లోకి వెళ్తే.. మీగడంపహాడ్ తండాకు చెందిన రూపావత్ చిన్న నాయక్ (54) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందాడు. అదే రాత్రి కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తండాకు తీసుకువచ్చారు. అయితే మఠంపల్లి మండలం మచ్చా తండాకు చెందిన
ఆంబోతు ను ఊరు మీద వదిలేస్తారు (ఊరికి మంచి జరగాలని వదిలేసిన ఎద్దు) నిన్న తెల్లవారుజామునే గ్రామస్తుల కన్నా ముందే ఇంట్లో వరండాలో పెట్టిన మృతదేహం వద్దకు చేరుకుంది. మృతదేహాన్ని దీనంగా చూస్తూ అక్కడే పడుకున్నది. అక్కడికి వచ్చినవాళ్లు వెళ్లగొట్టేందుకు ఎంత ప్రయత్నిం చేసిన సుమారు 2 గంటల పాటు అక్కడే ఉండిపోయింది. చివరికి కర్రలతో కొట్టడంతో వెళ్లిపోయింది. ఇలా ఆంబోతు తనకు సంబంధమే లేని వ్యక్తి మృతదేహం వద్దకు రావడంపై దేవుళ్లే పంపారంటూ స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. మృతి చెందిన చిన్న నాయక్ వ్యవసాయం చేస్తూ జీవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధిం చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..